భారత్ , ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ 20 సిరీస్‌లో భాగంగా ఈ రోజు చివరి టీ 20 మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. కొద్ది సేపటి క్రితం టాస్ వేయగా, ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇరు జర్లు చెరో రెండు మ్యాచ్‌లు విజయం సాధించి సమంగా ఉండగా, ఈ మ్యాచ్‌తో సిరీస్ విజేత ఎవరో తేలనుంది. గత మ్యాచ్‌లో భారత్ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే.
టీంల విషయానికి వస్తే భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. గత నాలుగు మ్యాచ్‌లలో భారత బౌలింగ్ పస కాస్త తగ్గడంతో ఈ మ్యాచ్‌కు రాహుల్ స్థానంలో నటరాజన్‌ను తీసుకున్నారు. ఇక ఇంగ్లండ్ జట్టు గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతధంగా కొనసాగించింది.ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్ విజయం సాధించి సిరీస్ ఎగిరేసుకుపోవాలని చూస్తుండగా, భారత్ టీ 20 సిరీస్‌ను సైతం వదిలి పెట్టకూడదని భావిస్తుంది.
తుది జట్లు
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, సూర్యకుమార్, పంత్, అయ్యర్, హార్దిక్, సుందర్, శార్దుల్, భువనేశ్వర్, రాహుల్ చాహర్, నటరాజన్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, వుడ్, సామ్ కర్రన్, ఆర్చర్, రషీద్, జోర్డాన్