T20 World Cup 2022 : టీ20 వరల్డ్ కప్ 2022 విజేత ఇంగ్లాండ్.! పాకిస్తాన్ ఓటమి.!

NQ Staff - November 13, 2022 / 07:05 PM IST

T20 World Cup 2022 : టీ20 వరల్డ్ కప్ 2022 విజేత ఇంగ్లాండ్.! పాకిస్తాన్ ఓటమి.!

T20 World Cup 2022 : టీ20 వరల్డ్ కప్ 2022 విజేతగా నిలిచింది ఇంగ్లాండ్ జట్టు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

138 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు 2022 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

దీన్నే కర్మ అంటారు: మహమ్మద్ షమీ.!

ఇంగ్లాండ్ జట్టు చేతిలో పాకిస్తాన్ జట్టు పరాభవం చవిచూడాల్సి వచ్చింది. దీనిపై పాక్ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అయితే, ‘హార్ట్ బ్రోకెన్’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

షోయబ్ అక్తర్‌పై కౌంటర్ ఎటాక్ చేసిన టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమి ‘దీన్నే కర్మ అంటారు’ అంటూ స్పందించాడు. నిజానికి, పాకిస్తాన్ ఓటమి పట్ల హర్షం వ్యక్తం చేయాలన్నది భారత క్రికెట్ అభిమానుల భావన కాకపోవచ్చుగానీ, ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా సెమీస్ దశలో ఓడిపోయినప్పుడు పాక్ క్రికెట్ అభిమానులు, పాక్ మాజీ క్రికెటర్లు, అత్యంత అసహ్యకరమైన రీతిలో సెటైర్లేశారు. అందుకే, షమీ ‘కర్మఫలం’ అని స్పందించాల్సి వచ్చింది.

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us