England : వన్డేల్లో ఇంగ్లాండ్ సంచలనం: వన్డే హిస్టరీలో అత్యధిక స్కోరు.!

NQ Staff - June 17, 2022 / 07:35 PM IST

England : వన్డేల్లో ఇంగ్లాండ్ సంచలనం: వన్డే హిస్టరీలో అత్యధిక స్కోరు.!

England : వన్డే క్రికెట్‌లో ఒకప్పుడు 200 పరుగుల స్కోర్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ తర్వాత అది చాలా చిన్న స్కోర్ అయిపోయింది. 300 పరుగులు సైతం ఇప్పుడు పెద్ద స్కోర్ ఏమీ కాదు. 400 పరుగుల స్కోర్ కూడా అడపా దడపా ఆయా జట్ల నుంచి నమోదవుతోంది.

England smash world record score against netherlands

England smash world record score against netherlands

ఇప్పుడు ఏకంగా, 500 స్కోర్ దగ్గరకు దాదాపుగా చేరిపోయింది. ఇంకో రెండు పరుగులు చేసి వుంటే, ఇంగ్లాండ్ పేరుతో వెరీ వెరీ స్పెషల్ రికార్డు నమోదయి వుండేదేమో. 498 స్కోర్ కూడా చిన్నదేమీ కాదు. అయితే, ఇంగ్లాండ్ ఈ స్కోర్ చేసింది నెదర్లాండ్స్ అనే చాలా చిన్న జట్టు మీద కావడం గమనార్హం.

పసికూనలపై విధ్వంసం

క్రికెట్‌లో పసికూనల్లాంటి జట్ల విషయానికొస్తే, నెదర్లాండ్స్ కూడా ఆ లిస్టులోనే వుంటుంది. అలాంటి జట్టు మీద ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. చితక్కొట్టేశారు ఇంగ్లాండ్ బ్యాటర్లు, నెదర్లాండ్స్ బౌలర్లను. ఈ క్రమంలోనే నిర్ణీత 50 ఓవర్లలో 498 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అదీ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి.

గతంలో ఇంగ్లాండ్ పేరిటే అత్యధిక పరుగుల రికార్డులు రెండున్నాయ్. అందులో ఒకటి 444 పరుగులు కాగా, ఇంకోటి 481 పరుగులు. సో, 500 పరుగుల రికార్డు కూడా ఇంగ్లాండ్ అతి త్వరలో సృష్టించేస్తుందేమో.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్ విషయానికొస్తే, ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ 93 బంతుల్లో 122 పరుగులు చేయగా, డేవిడ్ మలాన్ 109 బంతుల్లో 125 పరుగులు చేశారు. జోస్ బట్లర్ అయితే 70 బంతుల్లోనే 162 పరుగులు చేయడం గమనార్హం. లియామ్ లివింగ్ స్టోన్ 22 బంతుల్లో 66 పరుగులు చేశాడు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us