Pakistan And England : బౌలర్లకు ‘పిచ్చె’క్కించేస్తోంది.! క్రికెట్ చరిత్రలోనే చెత్త పిచ్.!
NQ Staff - December 3, 2022 / 04:43 PM IST

Pakistan And England : పాకిస్తాన్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.. అదీ పాకిస్తాన్లో. దాదాపు పదిహేడేళ్ళ తర్వాత పాకిస్తాన్లో ఇంగ్లాండ్ ఆడుతోంది. స్వదేశంలో ఎలాగైనా గెలవాలనే కసితో పాక్ జట్టు వుంది. తమ జట్టు గెలవడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చాలా అవసరం. అందుకే, బ్యాటింగ్ పిచ్ రూపొందించింది.
రావల్పిండిలో పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. టెస్ట్ మ్యాచ్‌లా కాకుండా వన్డే మ్యాచ్ తరహాలో ఆడేశారు. ఆ చితక్కొట్టుడుకి అంతా ముక్కున వేలేసుకున్నారు.
పాకిస్తాన్దీ అదే తీరు..
పాకిస్తాన్ బ్యాటింగ్ మొదలైంది.. మామూలుగా అయితే రెండ్రోజుల తర్వాత ఎలాంటి పిచ్ అయినా స్పిన్నర్లకు అనుకూలించాలి. కానీ, ఆ పరిస్థితి లేదక్కడ. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు సెంచరీలతో సత్తా చాటారు.
మరోపక్క, ఇంగ్లాండ్ జట్టు సభ్యులు తమ ప్రధాన బౌలర్ లీచ్ (స్పిన్నర్) వికెట్లు తీయలేక నీరసపడిపోతోంటే, అదని బోడి గుండు మీద గీకుతూ.. అతన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఇగ్లాండ్ జట్టు 101 ఓవర్లలో 657 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో 100 ఓవర్లు ఆడి 6.5 ప్లస్ రన్ రేట్‌తో పరుగులు చేసిన ఏకైక జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది.