Elon Musk : ట్విట్టర్.. అస్తవ్యస్తం అగమ్యగోచరం

NQ Staff - November 12, 2022 / 09:47 AM IST

Elon Musk : ట్విట్టర్.. అస్తవ్యస్తం అగమ్యగోచరం

Elon Musk : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ని వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ట్విట్టర్ యూజర్స్ కి మరింత అద్భుతమైన సేవలను అందించే అవకాశం ఉందని అంత భావించారు.

కానీ ట్విట్టర్ ని మస్క్ చేతుల్లోకి తీసుకున్న తర్వాత అంతా అస్తవ్యస్తం.. ఆగమ్యగోచరంగా మారింది. భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు ఉద్యోగులకు కఠిన పరీక్షలు పెడుతున్నారు. పని ఒత్తిడి తట్టుకో లేక కొందరు ట్విట్టర్ కి గుడ్ బై చెప్తూ ఉంటే.. మరి కొందరు అసంతృప్తితో ఉన్నారట.

వారంలో 80 గంటలు పని చేయాల్సిందే అని లేదంటే ఉద్యోగం నుండి తప్పుకోండి అంటూ మస్క్‌ ఇప్పటికే ఉద్యోగులకు కండిషన్ పెట్టడం జరిగింది. ఆఫీస్ లో ఉచిత భోజనం మరియు వర్క్ ఫ్రం హోం వంటి వసతులను గురించి ఉద్యోగులు ఆలోచించకుంటే మంచిదని కూడా మస్క్ ఉద్యోగులకు తెలియజేశారట.

ఇక ట్విట్టర్ వెరిఫికేషన్ విషయమై కూడా చాలా రచ్చ జరుగుతుంది. డబ్బులకి వెరిఫికేషన్ ఇస్తుండడంతో ఫేక్ అకౌంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాంతో చాలా వరకు వెరిఫికేషన్ కొత్తగా ఇవ్వడం ఆపేశారట.

ఇంతకుముందే వెరిఫికేషన్ కలిగి ఉన్నవారికి కంటిన్యూ చేస్తున్నారు. మొత్తానికి ట్విట్టర్ ని గందరగోళానికి గురి చేస్తున్నారని మార్కెట్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ట్విట్టర్ కొనుగోలు కోసం భారీ ఎత్తున బ్యాంకు నుండి రుణాలను మస్క్ తీసుకున్నాడట. ఆ రుణం తీర్చేందుకు పెద్ద ఎత్తున ట్విట్టర్ నుండి ఆదాయం రావాల్సిందే అని ఆయన భావిస్తున్నాడట అందుకే ఈ వ్యవహారం అంతా రచ్చ అవుతుంది.

Read Today's Latest Technology in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us