Elon Musk Removed Company X Logo : మస్క్ బ్రో.. ఆ ‘ఎక్స్’ ను తొలగించాల్సిందే
NQ Staff - August 1, 2023 / 12:31 PM IST

Elon Musk Removed Company X Logo :
ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, సెలబ్రెటీలు ఎక్కువగా వాడే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్. ఎలాన్ మస్క్ తన చేతిలోకి ట్విట్టర్ ను తీసుకున్న తర్వాత చాలా మార్పులు చేశాడు. గతంలో వచ్చే ఆదాయంతో పోల్చితే ఇప్పుడు రెండు మూడు రెట్లు అధికంగా ఆధాయం వచ్చే విధంగా మస్క్ మార్పులు తీసుకు వచ్చాడు.
ఎలాన్ మస్క్ తీసుకు వచ్చిన మార్పులను కొందరు విమర్శిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం అభినందిస్తున్నారు. ముఖ్యంగా బ్లూ టిక్ మార్క్ విషయం లో మస్క్ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారు. ఆ తర్వాత లోగో మార్పును కూడా చాలా మంది తప్పుబడుతున్నారు. పిట్ల ప్లేస్ లో ఎక్స్ ను తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.
కొత్త లోగో కి కష్టాలు…
ట్విట్టర్ కొత్త లోగోను యూఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రధాన కార్యలయం పై ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎక్స్ ను అత్యంత పెద్ద సైజ్ లో ఏర్పాటు చేయడం వల్ల చుట్టు పక్కల వారు తమకు ఇబ్బందిగా ఉంది బాబోయ్ అంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
మొత్తం 24 మంది ఆ లోగో ను భారీ ఎల్ ఈ డీ లైట్స్ ద్వారా ఏర్పాటు చేయడం వల్ల మాకు రాత్రి సమయంలో ఇబ్బందిగా ఉందని, ఆ వెలుతురు నేరుగా వచ్చి మా ఇళ్లలోకి వస్తుందని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మస్క్ కు ఆ లోగోను తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో మస్క్ తన కంపెనీ లోగోను తొలగించాడు.