Elon Musk : మనిషి మెదడులో ‘చిప్’ పెడతానంటున్న ఎలాన్ మస్క్.!
NQ Staff - December 1, 2022 / 03:25 PM IST

Elon Musk : ట్విట్టర్‌ని కొనుగోలు చేసి నానా యాగీ చేస్తోన్న ప్రపంచ కుబేరుడు, ప్రపంచ స్థాయి వ్యాపారవేత్త ఎలాన్ మస్క్, మరో సంచలనానికి తెరలేపోబుతున్నాడు. ఎలాన్ మస్క్‌కి సంబంధించిన న్యూరా లింక్ సంస్థ ‘బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్’ అనే సాంకేతికతను ఆరు నెలల్లో మానవులపై ప్రయోగించనుందట.
ఈ విషయాన్ని స్వయంగా న్యూరాలింక్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. మనిషి మెదడులో పెట్టబోయే చిప్‌తోపాటు దాన్ని పుర్రెలో అమర్చగలిగే రోబోని కూడా ఈ సందర్భంగా పరిచయం చేశారు ఎలాన్ మస్క్. కాలిఫోర్నియాలోని ప్రిమోంట్లో వున్న న్యూరాలింక్ ప్రధాన కార్యక్రమంలో వీటిని ప్రదర్శించారు ఎలాన్ మస్క్.
సరికొత్త ఆవిష్కరణ.. ఇదో పెను విప్లవం.!
పక్షవాతం కారణంగా దెబ్బ తిన్న అవయవాల్ని కదిలించేందుకు.. కంటి చూపు కోల్పోయినవారికి చూపు రప్పించేందుకు.. ఇలా అనేక అనారోగ్య సమస్యలకు ‘చిప్’ సాంకేతికత చెక్ పెట్టనుంది. వానరాలపై ఇప్పటికే చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి.
వానరానికి చిప్ అమర్చి, దాంతో వీడియో గేమ్ ఆడించారు. అయితే, ఎలాన్ మస్క్ కృతిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మానవులకన్నా తెలివైన ఈ సాంకేతిక ముందు ముందు మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందని మేధావులు కొందరు అభిప్రాయపడుతున్నారు.