Elon Musk : మళ్లీ వార్తల్లో మస్క్.. ఈసారి బరువు తగ్గినందుకు!
NQ Staff - November 17, 2022 / 11:16 AM IST

Elon Musk : ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
వెబ్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇలా అన్ని మీడియాలో కూడా ఆయన ట్విట్టర్ కోసం తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు అమలు చేయబోతున్న విధానాలు గురించి వార్తా కథనాలు వస్తున్నాయి.
ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నవారు ఉన్నారు.. అలాగే ప్రశంసలు కురిపిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో మస్క్ మరో సారి వార్తల్లో నిలిచాడు.
ఈసారి తాను 13 కేజీల బరువు తగ్గాను అంటూ వార్తలు నిలిచాడు. చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు అని ఒక ట్విట్టర్ యూజర్ మస్క్ ని ఉద్దేశించి ట్వీట్ చేయగా తాను 13 కేజీల బరువు తగ్గానని పేర్కొన్నాడు.
బరువు ఎలా తగ్గాలని మరో ట్విట్టర్ యూజర్ ప్రశ్నించగా ఆహార నియమాలను పాటించడం ద్వారా బరువు తగ్గానని పేర్కొన్నాడు. ఒక స్నేహితుడు సలహా మేరకు బరువు తగ్గించుకోవాలనుకున్నాను.
అందుకోసం ఆహారంలో మితంగా తినడంతో పాటు తనకు ఇష్టమైన ఆహార పదార్థాల జోలికి వెళ్ళవద్దని ముందుగానే నిర్ణయించుకున్నాను. మధుమేహంను అదుపులో పెట్టుకోవడం వల్ల కూడా తాను బరువు తగ్గాను అన్నట్లుగా మస్క్ చెప్పుకొచ్చాడు.