కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయలేము: సుప్రీం కోర్ట్

Advertisement

బీహార్ లో కరోనా పూర్తిగా తగ్గిపోయే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని అనే అంశంపై సుప్రీం కోర్ట్ స్పందించింది. కరోనాను కారణంగా చూపి ఎన్నికలను వాయిదా వేయామని ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ ముక్త రాష్ట్రంగా అవతరించే వరకు బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఇంకా నోటిఫికేషన్‌ వెలువడకముందే పిటిషన్‌ దాఖలు చేయడం తొందరపాటు చర్య అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అత్యవసర సమయాల్లో ఎన్నికల్ని వాయిదా వేయొచ్చని పిటిషనర్‌ అవినాశ్‌ ఠాకూర్‌ వాదించారు. ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. సామాన్య ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా కరోనా సోకుతోందని తెలిపారు. వీటిపై స్పందించిన కోర్టు.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here