కాశ్మీర్ వ్యాలీలో ఈద్ సంబరాలు

Advertisement

శ్రీనగర్: లాక్ డౌన్ నిబంధనల మధ్య కాశ్మీర్ వ్యాలీలో ముస్లిం సోదరులు ఈద్ సంబరాలు జరుపుకున్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్ లను ధరించి నమాజ్ నిర్వహించారు. కరోనా కారణంగా వ్యాలీ, శ్రీనగర్ లోని పెద్ద పెద్ద మజీద్ లలో సంబరాలు నిర్వహించకుండా ఉండేలా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ముస్లింలకు పవిత్రమైన ఈద్ పండగను ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుపుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

పెద్ద మజీద్ ల దగ్గర బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేసి, భద్రత సిబ్బందిని నియమించారు. అలాగే ప్రజలు సోషల్ డిస్టెన్స్ ను పాటించేలా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈద్ సంధర్బంగా ముస్లిం సోదరులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here