కోడి గుడ్డు పేలి మ‌హిళ ముఖానికి గాయాలు.. మీరు మాత్రం అలా చేయ‌కండి!

కోడి గుడ్డు పేలుతుంద‌ని మనం సాధార‌ణంగా విని ఉండం. కాని కొన్ని త‌ప్పుడు ప‌ద్దతులు పాటిస్తే అవి కూడా పేల‌తాయ‌ట‌. ఇంగ్లాండ్‌లోని బోల్టాన్‌లో నివసిస్తున్న చాంటెల్లే కాన్వే అనే మహిళ కోడి గుడ్లను ఉడకబెట్టేందుకు మైక్రో ఓవెన్‌ను ఉపయోగించ‌గా, ఆమెకు ఊహించ‌ని ప‌రిస్థితి ఎదురైంది. ముఖం, మెడ కాలిపోవ‌డంతో ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుంది.

టిక్ టాక్ , యూట్యూబ్‌ల‌కు అల‌వాటైన మ‌హిళ‌లు అందులో చెప్పే చిట్కాల‌ను పాటిస్తూ లేని పోని స‌మ‌స్య‌లు తెచ్చుకుంటున్నారు. గుడ్ల‌ను త్వ‌ర‌గా ఉడికించ‌డం కోసం చాలా మంది మైక్రో ఓవెన్‌ని ఉప‌యోగిస్తున్నారు. అలా ఉప‌యోగించ‌డం చాలా ప్ర‌మాదక‌రం అంటున్నారు నిపుణులు. ఓ మ‌హిళ జులై 2న ఎప్పటిలాగానే ఒక గాజు పాత్రలో నీళ్లు నింపి గుడ్లు ఉంచింది. ఆ పాత్రను మైక్రో‌వేవ్ ఓవెన్‌లో పెట్టింది.

10 సెక‌న్స్‌లోనే ఎగ్స్ ఉడికిపోగా, వాటికి బ‌య‌ట‌కు తీసింది. అయితే వేడి నీటిలో ఉన్న గుడ్ల‌ను తీసేందుకు చ‌ల్ల‌ని స్పూన్ ఉప‌యోగించింది. స్పూన్ గుడ్డుకు తాకిన వెంట‌నే విస్ఫోట‌నం జ‌ర‌గి గుడ్డు పేలింది. దీంతో ఆమె ముఖం, మెడ‌పై వేడి నీళ్లు ప‌డ‌డంతో కేక‌లు పెట్టింది. వెంట‌నే ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసుకి ఫోన్ చేసింది.

మ‌రిగిన నీళ్లు ముఖంపై ప‌డ‌డంతో బొబ్బ‌లు వ‌చ్చేశాయి. ఈ విష‌యాన్ని టిక్ టాక్ వీడియో ద్వారా తెలిపింది. ‘‘త్వరగా ఉడుకుతాయనే ఉద్దేశంతో నేను మైక్రో‌వేవ్ ఓవెన్‌లోనే గుడ్లును వేడి చేస్తున్నాను. గుడ్లను ఉడకబెట్టిన పాత్రలో స్పూన్ పెట్టగానే వేడి నీళ్లు ఒక్కసారే పైకి ఎగిసిపడ్డాయి. సీలింగ్‌ను కూడా తాకాయి. ల‌క్కీగా క‌ళ్లు మూసుకున్నాను కాబ‌ట్టి క‌ళ్లకు ఏం కాలేదు. మీరెప్పుడు అలా చేయ‌కండి అని మ‌హిళ పేర్కొంది. స

2019లో కూడా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంగ్లాండ్‌లోని వర్సెస్టర్‌సైర్ నగరానికి చెందిన బెదానీ రాసర్ (22) అనే యువతి గుడ్లను ఉడికించాలని అనుకుంది. ఈ క్ర‌మంలో మైక్రో‌వేవ్ ఓవెన్‌లో గుడ్లను ఉడికించ‌గా అవి పేలిపోయాయి.దీంతో ఆమె ముఖం కాలిపోయింది. గుడ్డు కంటిని తాకడంతో కన్ను వాచిపోయింది.