Eesha Rebba: తెలుగు అందం అదిరింది.. ప‌చ్చ‌ని మైదానంలో క్లీవేజ్ షోతో ర‌చ్చ‌

Eesha Rebba: సోష‌ల్‌ మీడియా ప్రాముఖ్య‌త పెరిగిన‌ప్ప‌టి నుండి అందాల భామ‌లు హాట్ హాట్ షోలతో ర‌చ్చ చేస్తున్నారు. ఓ వైపు హీరోయిన్స్ ర‌చ్చ కొన‌సాగుతుండ‌గా, మ‌రో వైపు బుల్లితెర యాంక‌ర్స్ కూడా అందాల ఆర‌బోత‌లో పోటీ ప‌డుతున్నారు.హీరోయిన్స్, యాంక‌ర్స్ హాట్ షోతో సోష‌ల్ మీడియా వేడెక్కిపోతుంది. రెగ్యుల‌ర్‌గా ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ‌లు అభిమానుల‌కు మాత్రం కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు.

తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా కూడా అడ‌పాద‌డ‌పా అందాల ఆర‌బోత‌తో యువ‌త మ‌న‌సుకు దోచుకుంటూ ఉంటుంది. అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది తెలుగు భామ ఈషా రెబ్బా. ‘బందిపోటు, అమీతుమీ’ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ’ మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

‘అరవింద సమేత వీరరాఘవ’లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది ఈషా. అందంతో పాటు బాగా అభినయించే కెపాసిటీ ఉన్నా ఆమెకు సరైన సినిమా రాలేదు. ఇప్ప‌టికీ మంచి ఆఫ‌ర్ కోసం ఎంతో ఆశ‌గా ఎద‌రు చూస్తూ ఉంది. అయితే ఖాళీ స‌మ‌యాల‌లో ఫొటో షూట్స్ చేస్తూ ఓవైపు నెటిజ‌న్స్ కి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూనే మ‌రోవైపు నిర్మాత‌ల‌కు గాలం వేసే ప్ర‌య‌త్నం చేస్తుంది.

ఎప్పటికప్పుడు నెటిజన్ల చూపు తమవైపుకు తిప్పుకునే హీరోయిన్లలో ఒక‌రైన ఈషా రెబ్బ తాజాగా పచ్చని ప్రకృతి మధ్యలో అందాలు ఆర‌బోసింది. క్లీవేజ్ షోతో మ‌తులు పోగొడుతుంది. ప్ర‌స్తుతం ఈషా ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా ‘పిట్ల కథలు’ వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ షా ప్రస్తుతం తెలుగులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో మాత్రం నటిస్తోంది. తమిళ, మలయాళ చిత్రాలపై కూడా ఈ అమ్మ‌డు దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తుంది.