బిగ్ బ్రేకింగ్: నాలుగు దశాబ్ధాల త‌ర్వాత ఈనాడుకి రాజీనామా చేసిన శ్రీధర్

ఈనాడు సంస్థ‌తో నాలుగు ద‌శాబ్ధాల పాటు ప్ర‌యాణించిన ప్ర‌ముఖ కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ చాలా మందికి ప‌రిచ‌యం. త‌న 65 ఏళ్ల జీవితంలో 40 ఏళ్ల‌కు పైగా ఈనాడు సంస్థ‌తో క‌లిసి ప‌నిచేసిన శ్రీధ‌ర్ తనదైన శైలిలో కార్టూన్లను రూపొందించి పాఠకుల్లో ఈనాడు ఆదరణకు నిరుప‌మైన సేవ‌లు చేశారు.

sreedhar

ప్ర‌తిభా సంప‌న్నుడు, వ్యంగ్య చిత్ర కారుడైన శ్రీ‌ధ‌ర్ రావు ఈనాడు పేపర్ లో మొదటి పేజీలో కార్నర్ లో ప్రచురించే అతని కార్టూన్లు సమకాలిన అంశాలపై సెటైర్లు వేస్తూ ఎంతో మంది పాఠకులను ఆలోచింపజేశాయి. నాలుగు దశాబ్దాల తర్వాత వీడ్కోలు పలికారు. 40 ఏళ్ల తర్వాత ఈనాడు సంస్థకు రాజీనామా చేశానని శ్రీధర్ తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించారు.

ఈనాడు లేని శ్రీధర్ ను, శ్రీధర్ లేని ఈనాడు ను ఊహించలేము. గత కొద్ది కాలంగా ఆయన స్పాండలైటిస్ తో బాధపడుతున్నారు. ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఆ మధ్యనే కుమారుడి పెళ్లి చేసారు. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసారని అంటున్నారు. కానీ వేరే కారణాలు ఉన్నాయని జర్నలిస్ట్ వర్గాల బోగట్టా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శ్రీధ‌ర్‌కు పద్మ‌శ్రీ అవార్డ్ ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించ‌గా, దానికి మేనేజ్‌మెంట్ అంతగా ఆస‌క్తి చూప‌లేద‌ని, ఈ కారణంతోనే ఆయ‌న వీడ్కోలు ప‌లికాడ‌ని స‌మాచారం. మ‌రోవైపు ఇటీవ‌ల ఆయ‌న ఈనాడులో న‌లభై ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయ‌న‌తో పని చేస్తున్న‌వారు ఫంక్ష‌న్స్, బ‌హుమ‌తులు అంటూ కాస్త హ‌డావిడి చేశారని అది మేనేజ్‌మెంట్‌కి న‌చ్చ‌లేద‌ని భోగ‌ట్టా.

వీటిలో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని ఆయ‌న ఎందులోను ప‌నిచేయ‌క‌పోతే మంచి కార్టూనిస్ట్ సృజ‌న‌ని త‌ప్ప‌క మిస్ అవుతాం. ఈనాడు యాజ‌మాన్యం శ్రీధ‌ర్‌ని ఎప్పుడూ ఉద్యోగిగా చూడ‌లేదు. రామోజీరావు ద‌త్త పుత్రుడిగానే చూసింది. ఈ విషయాన్ని రామోజీ రావు సైతం చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. సాక్షి మొద‌లైన‌ప్పుడు శ్రీ‌ధ‌ర్‌కి మంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. కానీ శ్రీ‌ధ‌ర్ ఈనాడుని వ‌దిలి వెళ్ల‌లేదు. ఏదేమైన ఇప్పుడు శ్రీధ‌ర్ నిర్ణ‌యం ఈనాడుకి పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.