MLC Kavitha : కవితకు ఈడీ నోటీసులు.. రిమాండ్ రిపోర్టులోనూ పేరు..!
NQ Staff - March 8, 2023 / 09:18 AM IST

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఇంకా ఆగట్లేదు. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారించాలటూ ఈడీ ఆమెకు నోటీసులు పంపింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీకి రావాలంటూ నోటీసుల్లో తెలిపింది. ఈ ఘటనతో బీఆర్ ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.
మంగళవారం హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణలో తాను కవిత బినామీని అని ఆయన ఒప్పుకున్నట్టు తెలిపింది ఈడీ. దాంతో ఇప్పుడు కవితను ఈడీ విచారణకు పిలవడం సంచలనం రేపుతోంది.
అయితే 10వ తేదీనే ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించుకుంది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె ధర్నా చేయాలని భావించింది.