Health Tips : గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, మలబద్దకం వేధిస్తుందా..ఈ ఫుడ్ తీసుకుంటే వాటికి ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు..
NQ Staff - September 28, 2023 / 05:56 PM IST

Health Tips :
ఆధునిక జీవితంలో ఇన్‌స్టంట్ ఫుడ్, స్టోరేజీ ఫుడ్ , మసాలా ఫుడ్స్ తీసుకోవడం వలన అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బయట ఫుడ్ ప్రధానంగా తగ్గించాలని లేకపోతే కడుపునకు సంబంధించిన గ్యాస్ట్రిక్, మలబద్దకం, ఎసిడిటీ వ్యాధులు తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన, తాజా ఆహారం తీసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బాగా ఫ్రై చేసిన ఆహారం, ప్యాకేజ్‌డ్ ఫుడ్, మసాలా ఎక్కువగా కలిగిన ఆహారం వంటివి తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. జంక్ ఫుడ్ కూడా ఎంత మితంగా తింటే అంత బెటర్. లేనియెడల గ్యాస్, కడుపునొప్పి, మలబద్దకం, విరేచనాలు, అపానవాయువు వంటి సమస్యలు వేధించే అవకాశం ఉంది.
అందుకే నేటితరం ప్రజలు ప్రధానంగా జీర్ణక్రియ మీద ఫోకస్ చేయాలి. జీర్ణక్రియ బాగుంటే ఎటువంటి సమస్యలు దరిచేరవు. ఇందుకోసం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో డైట్ మెయింటేన్ చేయాలి. జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు ఇలాంటి ఆహారం తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు.
శరీరానికి పప్పులు మంచి ప్రోటీన్‌ను అందిస్తాయి. అందులోనూ పెసరపప్పు కిచిడీ తినడం వలన మనం ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. దీంతో జీర్ణక్రియ కూడా బాగుంటుంది. అదేవిధంగా పెరుగు చాలా సులువుగా డైజెస్ట్ అయ్యే పదార్థం.. పెరుగులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. పెరుగు తింటే కూడా జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. పెరుగులో ప్రో బయోటిక్ ఉండటం వలన ఇది మన జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజు ఒక కప్పు పెరుగుతింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఉడకబెట్టిన బంగాళదుంపలు తినడం వలన తక్షణమే శక్తి పొందుతారు. కడుపును ఆరోగ్యంగా ఉంచడంలో ఆలు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు హెర్బల్ టీ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి వికారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే అల్లం టీ, చామంతి టీ, పుదీనా టీ లేదా ఫెన్నెల్ టీలను తాగొచ్చు.
చివరగా అరటిపండు మన శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. ఇందులో పోటాషియం , పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. డయేరియా, విరోచనాల సమస్య నుంచి బయట పడేందుకు సహాయపడుతుంది.అరటిపండ్లు తినడం వలన శరీరానికి శక్తి లభించి జీర్ణసమస్యలు తగ్గే చాన్స్ ఉంది. కొందరు నాన్ వెజ్, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు. ఫలితంగా వారికి జీర్ణసమస్యలు వస్తే ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. కడుపులో మంట రావడం దీని లక్షణాలు.
అలాంటప్పుడు కాస్త సొంపు లేదా జిలకర్ర తినడం మంచిది. జిలకర్ర జ్యూస్ తాగడం వలన ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.