Health Tips : రాత్రి సమయంలో ఈ ఆహారాలు తింటున్నారా.. అయితే చాలా డేంజర్..
NQ Staff - September 18, 2023 / 01:43 PM IST

Health Tips :
చాలామందికి రాత్రి సమయంలో కొన్ని ఫుడ్స్ తినే అలవాట్లు ఉంటాయి. ఈ జనరేషన్ లో చాలామంది అర్ధరాత్రి కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారు. నిద్ర పోకుండా రోడ్ల మీద దొరికే ఫుడ్స్ ను ఎక్కువ తింటుంటారు. అయితే రాత్రి సమయంలో కొన్ని ఆహారాలు తింటే శరీరానికి చాలా ప్రమాదం అని అంటున్నారు కొందరు. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ సమస్యలే కాకుండా నిద్రలేమి లాంటి సమస్యలు కూడా ఎన్నో వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
స్పైసీ ఫుడ్స్
కారంతో తినే ఫుడ్స్ ను చాలామంది ఇష్టపడుతారు. కానీ రాత్రి సమయంలో ఇవి తినడం వల్ల గుండెల్లో మంట, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయి. స్పైసీ ఫుడ్ ను తిని పడుకుంటే కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహిస్తుంది. ఇది రాత్రి సమయంలో నిద్రలేమికి దారి తీస్తుంది. చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినకపోవడమే చాలా మంచిదని చెబుతున్నారు డాక్టర్లు.
కెఫిన్
రాత్రి సమయంలో మనకు ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ అస్సలు తినొద్దు. కెఫిన్ అనేది మన శరీరానికి చాలా ఎనర్జీ ఇస్తుంది. అందుకే రాత్రి సమయంలో దీన్ని తింటే బాడీని యాక్టివ్ చేస్తుంది. దాని వల్ల రాత్రి నిద్ర పట్టదు. అందుకే రాత్రిళ్లు వీటిని మాత్రం తాగకండి.
కొవ్వు పదార్థాలు..
కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం శరీరానికి చాలా ప్రమాదకరం. చాలామంది రాత్రి సమయంలో టేస్టీ కోసం ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలు, చీజ్ లను ఎక్కువ మొత్తంలో తింటారు. వీటిల్లో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. దాని వల్ల జీర్ణ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఆయిల్ ఫుడ్స్..
ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. చాలామంది జంక్ ఫుడ్, స్వీట్లు, చాక్లెట్లు, నూనెలో వేయించిన ఫుడ్స్ ఎక్కువగా తింటారు. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దాని వల్ల కడుపులో ఆహారం పేగుల చుట్టూ పేరుకుని పోతుంది. అందుకే రాత్రి సమయంలో వాటిని అస్సలు తినకండి.
కేకులు..
కేకులు, ఐస్ క్రీమ్ లు, కుకీలు లాంటివి అస్సలు తినొద్దు. వీటిలో స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తిని వెంటనే రాత్రి పడుకోవడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు పెరిగి షుగర్ వ్యాధికి దారి తీస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉండటం చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.