East Godavari: ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న వియ్యంకుల సారె.. కోడ‌లికి 10 వేల సీట్ల‌ను సారెగా పంపిన మామ‌

Samsthi 2210 - August 16, 2021 / 04:36 PM IST

East Godavari: ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న వియ్యంకుల సారె.. కోడ‌లికి 10 వేల సీట్ల‌ను సారెగా పంపిన మామ‌

East Godavari: మ‌న తెలుగు రాష్ట్రాల‌లో సంస్కృతి సంప్ర‌దాయ‌లకు ఎంత పెద్ద పీట వేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇవి ఎక్కువ‌గా ఉంటాయి. ఆడపిల్లల తరఫువారు ఆషాఢంలో వియ్యంకుడి ఇంటికి సారె పంప‌డం కొన్నాళ్లుగా వ‌స్తుంది. మధ్య తరగతి వారు తమ తాహతుకు తగినట్లు సారె పంపిస్తుండగా… ధనవంతులైతే బంధువులు గొప్పగా చెప్పుకొనే విధంగా రూ.లక్షలు ఖర్చుపెట్టి సారె పంపుతున్నారు.

East Godavari

వివాహం ఎలా జరిగింది అనేదానికంటే.. అల్లుడుకి ఏమిచ్చారు.. ఎంతిచ్చారు.. కోడలికి ఎంత బంగారం పెట్టారనేవాటిపైనే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతుంటుంది. ఇటీవ‌ల తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన బత్తుల బలరామకృష్ణ అనే వ్యాపారి తన పెద్ద కుమార్తె ప్రత్యూషను యానాంకు చెందిన తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కుఇచ్చి మేలో పెళ్లి చేశారు.

అల్లుడికి సారెను పంప‌గా, అది చూసి అత్తింటివారు అవాక్కయ్యారు. వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్‌లతో వస్తువులను పంపించారు. లారీల్లో వెళ్లిన ఆషాఢం సారె రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అల్లుడు కుటుంబం కూడా ఎందుకు తగ్గాలి అనుకున్నారేమో ఏమో ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. అక్కడితో ఆగలేదు.. భారీ సంఖ్యలో అరటి గెలలు కూడా పంపించారు. ఆశాడం తర్వాత వచ్చిన శ్రావణమాసం సందర్భంగా తమ కుమారుడ్ని అత్తవారి ఇంటికి పంపుతూ 5 వాహనాల్లో 10 టన్నుల బరువున్న 20 రకాల స్వీట్లను సారెగా పంపారు. ఇందులో తాపేశ్వరం కాకినాడ కాజాలు, లడ్డూలు, ఇతర స్వీట్లున్నాయి. అలాగే 100 అరెటి గెలలు, చీరలు, రవికలు, వివిధ రకాల పండ్లు, పూలు కూడా ఉన్నాయి.

మొత్తానికి తోట, బత్తుల వార్ల కావిళ్ళు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. పెళ్లైన తర్వాత రానున్న‌ మొదటి సంక్రాంతికి మామగారు అల్లుడుకి ఎలాంటి కానుకలిస్తారనే దానిపై గోదావరి జిల్లాల్లో ఇప్పటికే చర్చ జరుగుతోంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us