ఈజీ ఆఫ్ డూయింగ్ బిసినెస్ లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్

Advertisement

గత కొంతకాలం నుండి ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను చెప్పింది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిసినెస్ కు సంబంధించిన ర్యాంకులను కేంద్రం నిన్న విడుదల చేసింది. బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌-2019 ర్యాంకింగ్‌ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో యూపీ, మూడో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు. ఈ జాబితాలో మరోసారి ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2017-18లో ఏపీ మొదటి స్థానంలో ఉంది.. ఇప్పుడు 2018-19లోనూ అగ్రస్థానంలో నిలిచింది.

అయితే గతంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిసినెస్ లో తెలంగాణ మాత్రం మూడవ స్థానంలో నిలిచింది. 2017-18లో తెలంగాణ ప్రభుత్వం రెండవ స్థానంలో నిలువుగా, 2018-2019లో మాత్రం మూడవ స్థానంలో నిలిచింది. 2017-18లో పన్నెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రెండో స్థానం సంపాదించుకుంది. ఇక నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, ఐదో స్థానంలో ఝార్ఖండ్‌, ఆరో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌లు నిలిచాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here