Earthquake : ఇండోనేసియాలో భారీ భూకంపం! పదుల సంఖ్యలో మృతులు.!

NQ Staff - November 21, 2022 / 03:37 PM IST

Earthquake : ఇండోనేసియాలో భారీ భూకంపం! పదుల సంఖ్యలో మృతులు.!

Earthquake : భూకంపాల దేశంగా ఇండోనేసియాని అభివర్ణిస్తుంటారు. తాజాగా ఇండోనేసియాలోని జావా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతను 5.6 అని ప్రాథమికంగా నిర్ధారించినా, తీవ్రత ఇంకా ఎక్కువే వుండొచ్చునని అనుమానిస్తున్నారు.

కాగా, భూ ప్రకంపనల ధాటికి జావా ద్వీపంలో పెద్ద సంఖ్యలో ఇళ్ళు నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

మృతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం..

ప్రాథమికంగా 25 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే, శిధిలాల కింద పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయి వుంటారని అనుమానిస్తున్నారు. భారీ భూకంపం తర్వాత స్వల్ప ప్రకంపనలు వస్తుండడంతో, సహాయక చర్యలకూ ఆటంకం కలుగుతోంది.

తీర ప్రాంతంలో భూకంపం రావడంతో, సునామీ వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్న అధికారులు, అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు.
కాగా, ఈ భూకంప తీవ్రతకు 300 మందికి పైగా ఇప్పటికే మరణించినట్లు అనధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us