Dwarampudi Chandrasekhar Reddy : అంత డబ్బుంటే నీకు ప్యాకేజీ పడేస్తా.. పవన్ పై ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఫైర్..!
NQ Staff - June 19, 2023 / 01:04 PM IST

Dwarampudi Chandrasekhar Reddy : వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ పోర్టులో రైస్ వ్యాపారం చేసి రూ.15వేల కోట్లు సంపాదించాడంటూ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు, విమర్శలపై ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్రంగా స్పందించారు.
తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అసలు కాకినాడ పోర్టులో ఎక్స్ పోర్టు అయ్యే రైస్ విలువ కూడా రూ.15వేల కోట్లు ఉండదు. మరి నేను ఎలా సంపదిస్తాను. ఒకవేళ అంత డబ్బే నా దగ్గర ఉండే పవన్ నీకు ప్యాకేజీ పడేస్తా కదా.
చంద్రబాబు ఎందుకు.. నేనే నీకు ప్యాకేజీ ఇచ్చేసి ఓ రెండు సీట్లు పడేస్తాం కదా. కాబట్టి పిచ్చి పిచ్చిగా వాగకు. నువ్వో రాజకీయ వ్యభిచారివి. నువ్వు ఎవరిని ఉద్దరించడానికి పార్టీ పెట్టావ్. పార్టీ పెట్టినప్పుడు నీతో ఉన్న వారు ఇప్పుడు ఎందుకు లేరు.. నీ గురించి అందరికీ తెలుసు. నీకు కావాల్సింది ప్యాకేజీ డబ్బులు.
నీకు చంద్రబాబుతో బేరం కుదరకనే ఇప్పుడు వారాహి పేరుతో రోడ్డు మీదకు వచ్చావ్. అది అందరికీ తెలుసు. నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఒకవేళ నేను అవినీతి చేస్తే నాకు రెండోసారి ఓట్లేయరు కదా. నువ్వు రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయావ్. నీకు నన్ను విమర్శించే స్థాయి లేదు అంటూ మండిపడ్డారు చంద్రశేఖర్.
Best one Chandra Shekar anna ????#PackageStarPK pic.twitter.com/cchBMTqNiF
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) June 19, 2023