దుబ్బాక ఉపఎన్నిక బరిలో రాములమ్మ ?

Advertisement

ప్రస్తుతం తెలంగాణ మొత్తం చూపు దుబ్బాక ఉప ఎన్నికల పైన ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. దీనితో ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. అయితే తెరాస తరుపున రామలింగారెడ్డి కుమారుడికి టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే బీజేపీ పార్టీ నుండి రఘునందన్ రావు బరిలో ఉండబోతున్నట్లు, ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టాడు.

కానీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి విషయంలో ఎటువంటి విషయం తెలపలేదు. అయితే తాజాగా ఓ వార్త జోరుగా ప్రచారం అవుతుంది. దుబ్బాక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయ శాంతిని రంగంలోకి దింపాలని ఆ పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో విజయశాంతికి మంచి పట్టు ఉంది. ఇక మెదక్ జిల్లాలో ముత్యం రెడ్డి తరువాత అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకురాలు గా విజయశాంతి కి మంచి పేరు ఉంది.

గతంలో ఉమ్మడి ఎంపీ గా పనిచేసి మంచి పట్టు ఏర్పాటు చేసుకుంది. అలాగే 2014 ఎన్నికలో మెదక్ అసెంబ్లీ నుండి పోటీ చేసి మంచి పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యింది. గత ఏడాది కూడా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో మంచి పట్టు ఉన్న రాములమ్మకు దుబ్బాక టికెట్ ఇచ్చి గెలవాలని ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. చూడాలి మరి దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొంది గద్దెన ఎవరు ఎక్కుతారో..

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here