KTR: డ్ర‌గ్స్ కేసు.. నా ర‌క్తం,వెంట్రుక‌లు ఇస్తానంటూ కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్

KTR: డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారం రోజు రోజుకి ప్రకంప‌న‌లు పుట్టిస్తుంది. సినిమా,రాజ‌కీయానికి చెందిన వారిపై కూడా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.ఇప్ప‌టికే టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన 12 మంది సెల‌బ్రిటీల‌ను ఈడీ విచారించి ప‌లు విష‌యాలను రాబ‌డుతున్నారు. ఎక్సైజ్ అధికారులు సరిగ్గా విచారణ జరపనందునే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఓ వైపు ఈ వ్యవహారంపై అధికార, విపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతుండగా.. ఈ కేసులో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందంటూ ఈడీకి ఫిర్యాదు అందడం కలకలం రేపుతోంది.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్‌కు ప్రమేయం ఉన్నదని, అందువల్లనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దర్యాప్తు సక్రమంగా జరగకుండా ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు.

ఈ నేప‌థ్యంలో కేటీఆర్ స్పందిస్తూ.. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం- ఈడీ కి లెటర్ ఇచ్చిన వాడు బఫున్ అని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడుతాం. అవసరం అయితే రాజద్రోహం కేసులు కూడా పెడుతాం అని హెచ్చరించారు. అడ్రస్ లేని వ్యక్తులు కేసీఆర్ ని తిడితే ఉరుకోమని… ఉద్యమంలో కేసీఆర్ తిడితే ఆనాడు ఉద్వేగం ఉంది.

ఇవ్వాళ వీళ్లకు ఏం రోగం అని ప్రశ్నించారు కేటీఆర్. సింగరేణి బాలిక ఘటన పై చట్టం తనపని తాను చేసిందని… దిశ ఘటన పై దేశం హర్షించింది..నాకు కూతురు ఉంది కన్నీళ్లు పెట్టుకున్నాం అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంను ఆదర్శంగా తీసుకుంటున్నాం…సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతామని తెలిపారు.

నేను రక్తం,వెంట్రుక‌లు కూడా ఇస్తాను. ఏ ప‌రీక్ష‌లు కావాలంటే అవి చేసుకోవ‌చ్చు. రాహుల్ గాంధీ కూడా ఇస్తారా అని కేటీఆర్ మండిప‌డ్డారు. ఎవ‌డో బ‌ఫూన్ చెప్పిన మాట‌ల‌ని ప‌ట్టించుకుంటే ఎలా అని ఫైర్ అయ్యారు.