Driver: అదృష్టం అంటే అత‌డిదే..లాట‌రీలో 40 కోట్లు గెలుచుకున్న డ్రైవ‌ర్

Driver: అదృష్టం ఉండాలే కాని బ్యాడ్ ల‌క్ టైంలోను అంతా మంచే జ‌రుగుతుంటుంది. సామాన్యులు కూడా ఒక్కోసారి కోటీశ్వ‌రులుగా మారుతారు.కూలీ నాలి పని చేసుకొని పొట్ట నింపుకునే వారిని ల‌క్ష్మీ దేవి కరుణిస్తుంటుంది. తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న దీనికి నిద‌ర్శ‌నం. ప‌ని కోసం కేర‌ళ నుండి దుబాయ్‌కి వెళ్లిన డ్రైవర్‌కి అనుకోని విధంగా అదృష్టం తలుపు త‌ట్టింది. ఆ అదృష్టం అత‌నొక్క‌డికే కాదు అత‌నితో పాటు ఉన్న 9 మందిని కూడా వ‌రించింది.

వివ‌రాల‌లోకి వెళితే కేరళకు చెందిన రంజీత్ సోమరాజన్ దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అంద‌రికి మ‌ద్యం, సిగ‌రెట్ వ్య‌స‌నం ఉన్న‌ట్టు అత‌నికి లాట‌రీ టిక్కెట్ల‌కు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టే అల‌వాటు ఉంది. ఏదో ఒక రోజు అదృష్టం వ‌రించి కోటీశ్వ‌రుడిని కానా అనే చిన్న న‌మ్మ‌కం అతనిలో ఉండేది. అయితే ఓ రోజు తనతో కలిసి పనిచేసే మరో తొమ్మిదితో కలిసి ‘రెండు కొంటే ఒకటి ఉచితం’ ఆఫర్ కింద లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.

ఎంత వ‌చ్చిన కూడా అందులో మొత్తాన్ని ప‌ది మంది పంచుకోవాల‌ని డిసైడ్ అయ్యారు.అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించిన డ్రాలో రంజీత్‌కు 20 మిలియన్ దిర్హం‌ (సుమారు రూ.40 కోట్లు) గెలుచుకున్నాడు. ఊహించని మొత్తం అత‌నికి ద‌క్క‌డంతో రంజిత్ గాల్లో తేలిపోయాడు.

లాట‌రీ గెలుచుకున్న త‌ర్వాత మీడియాతో మాట్లాడిన రంజిత్.. దుబాయ్‌లో 2008 నుంచి పనిచేస్తున్నాను. పలు కంపెనీల్లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాను. జీతం అస్స‌లు స‌రిపోక‌పోవ‌డంతో డ్రైవ‌ర్ క‌మ్ సేల్స్‌మెన్‌గా కూడా ప‌ని చేశాను. ప‌రిస్థితులు బాలేని స‌మ‌యంలో నాకు లాట‌రీ లభించ‌డం నిజంగా అదృష్ట‌మే.

‘‘మేం మొత్తం 10 మంది ఉన్నాం. మిగతావారు ఇండియా, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందినవారు. వారంతా ఓ హోటల్‌లోని వాలెట్ పార్కింగ్‌లో పనిచేస్తున్నారు. జూన్ 29న మేమంతా కలిసి 100 దిర్హమ్‌ల చొప్పున నగదు జమా చేసుకుని ‘Buy two and get one free’ ఆఫర్ కింద టికెట్లు కొనుగోలు చేశాం. నా పేరు మీద ఉన్న టిక్కెట్‌కు లాట‌రీ త‌గ‌ల‌డంతో అంద‌రం సుమారు రూ.4 నుంచి రూ.5 కోట్లు పంచుకున్నాం అని రంజీత్ తెలిపాడు. ఏదేమైన ఇన్ని రోజుల ప‌డ్డ క‌ష్టం ఒక్క దెబ్బ‌కు తీరిపోయింది.