కరోనా మందును విడుదల చేసిన ‘డా. రెడ్డీస్ లాబొరేటరీస్’

Advertisement

ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చేస్తుంది. ఈ తరుణంలో ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కస్టపడుతున్నాయి. ఇక ఈ తరుణంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు హైదరాబాద్ నుండి వ్యాక్సిన్ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఎందుకంటె హైదరాబాద్ లో ఫార్మా ఇండస్ట్రీలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇదే తరుణంలో దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ ‘రెమ్‌డెసివిర్’‌ కొత్త ఔషధాన్ని విడుదల చేసింది. కరోనా వైరస్ బాధితుల చికిత్సకు గాను భారతదేశంలో ‘రెడిక్స్’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే 100 మి.గ్రా పరిమాణంలో రెడిక్స్ మందును విడుదల చేసినట్టు తెలిపింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here