Double Decker Flyover Metro Coming Up In Hyderabad : భాగ్య నగరంలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ మెట్రో ఇలా…!

NQ Staff - August 1, 2023 / 08:36 PM IST

Double Decker Flyover Metro Coming Up In Hyderabad : భాగ్య నగరంలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ మెట్రో ఇలా…!

Double Decker Flyover Metro Coming Up In Hyderabad :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో మరిన్ని ప్రాంతాలకు మెట్రో ను విస్తరించబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. హైదరాబాద్‌ చుట్టు కూడా మెట్రోను విస్తరించేందుకు గాను కేబినేట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే నాలుగు సంవత్సరాల్లో అనుకున్న మొత్తం మెట్రో లైన్ ల నిర్మాణం పూర్తి అవ్వాలని అధికారులు అప్పుడే పనులు మొదలు పెట్టారు.

ఇప్పటికే ఉన్న లైన్స్ పై నుండి మెట్రో లైన్ లు వెళ్లాల్సి ఉంది. కొన్ని చోట్ల ఫ్లై ఓవర్స్ పై నుండి కూడా మెట్రో లైన్ వేయాల్సి ఉంది. అందుకే హైదరాబాద్ లో మొదటి సారి డబుల్ డెక్కర్ ఫై ఓవర్ లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా అధికారులు ప్రకటించారు.

జేబీఎస్ నుండి తూంకుంట వరకు…

జైబీఎస్ నుండి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్ బ్రిడ్జీ ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా పాట్నీ నుండి కండ్లకోయ వరకు కూడా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.

Double Decker Flyover Metro Coming Up In Hyderabad

Double Decker Flyover Metro Coming Up In Hyderabad

అందుకు సంబంధించిన నమూనాలను కూడా అధికారులు విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలో ఇలాంటి నమూనాలతో ఫ్లై ఓవర్‌ లను ఏర్పాటు చేయలేదని… భాగ్య నగరంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నట్లుగా చర్చ జరుగుతోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us