KTR : కేసీఆర్ రాకతో కామారెడ్డికి లాభమే… రేవంత్ మాటలు నమ్మొద్దు.. కేటీఆర్ కామెంట్లు..!

NQ Staff - November 26, 2023 / 09:15 AM IST

KTR : కేసీఆర్ రాకతో కామారెడ్డికి లాభమే… రేవంత్ మాటలు నమ్మొద్దు.. కేటీఆర్ కామెంట్లు..!

KTR :

కేసీఆర్ రాకతో కామారెడ్డికి లాభమే తప్ప నష్టం ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ వచ్చి కామారెడ్డిలో భూములు లాక్కుంటారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కేసీఆర్ 70 ఏళ్ల వయసులో వచ్చి ఎవరి భూములు లాక్కుంటారో మీరే చెప్పాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాంటి ఆలోచన ఉంటే రైతుల కోసం ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని పథకాలు తెచ్చేవారు కాదు అంటూ తెలిపారు కేటీఆర్. తాజాగా ఆయన కామారెడ్డి, గోషామహల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారంటే.. కలిసొచ్చే కాలానికి నడిచచ్చే కొడుకు రావడమే అంటూ తెలిపారు కేటీఆర్.

రేవంత్ రెడ్డి కావాలనే కామారెడ్డికి వచ్చి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను నమ్మితే మన రాష్ట్రం చీకట్లోకి వెళ్లడం ఖాయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు అంటూ తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు అడ్డం పొడువు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారి మాటలు అస్సలు నమ్మొద్దు. ఎకరం కాదు.. గుంట కాదు.. గజం కాదు… ఇంచు జాగలు కూడా ఎక్కడకు పోవు. ఎందుకంటే కేసీఆర్ లేని వారికి భూములు పంచే మనసు ఉన్న వ్యక్తి కానీ.. రేవంత్ రెడ్డిలాంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు అంటూ మండిపడ్డారు కేటీఆర్.

భిక్కనూర్ గడ్డ మీదకు వచ్చి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ కామారెడ్డి అంటేనే ఉద్యమాలకు పురుడు పోసిన గడ్డ అని మాత్రం ఆయనకు తెలియట్లేదు. ఇది బీఆర్ ఎస్ అడ్డా అని తెలియక రేవంత్ వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు. ఆయనకు సరైన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ తెలిపాడు కేటీఆర్. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకే లాభమని చెప్పారు. ఎల్లారెడికి చెందని కేసీఆర్ ను కొందరు నాన్ లోకల్ అంటూ మాట్లాడుతున్నారు. బీజేపీ అభ్యర్థే నాన్ లోకల్ వ్యక్తి. కేసీఆర్ అమ్మ గారిది ఇక్కడే కోనాపూర్ గ్రామం అని తెలిపారు కేటీఆర్.

ఆ తర్వాత అటు నుంచి గోషామహల్ కు వెళ్లిన కేటీఆర్ రాజాసింగ్ మీద నిప్పులు చెరిగారు. రాజాసింగ్ అంటేనే ఒక మత పిచ్చి ఉన్న వ్యక్తి. అతనికి నియోజకవర్గాన్ని డెవలప్ చేసే ఉద్దేశమే లేదు. ఎంతసేపు పంచాయతీలు తప్ప మరో ఆలోచన ఉండదు ఆయనకు. అలాంటి వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది.

రాబోయే ఐదు రోజుల్లో రాజాసింగ్ జాతకం ఏంటో తేలిపోయే సమయం వచ్చింది. గోషామహల్ ను నేను దత్తత తీసుకుంటాను. రాబోయే రోజుల్లో గోషామహల్ ను డెవలప్ చేసే బాధ్యత నాది. కాబట్టి మీరంతా బీఆర్ ఎస్ అభ్యర్థినే గెలిపించండి. రాబోయే రోజుల్లో గోషాల్ మహల్ రూపు రేఖలు మార్చి చూపిస్తా అంటూ తెలిపారు కేటీఆర్.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us