ఇండియా, చైనా కంటే అమెరికా ఉత్తమం: ట్రంప్
Admin - August 4, 2020 / 10:11 AM IST

వాషింగ్ టన్: కరోనాపై పోరాటం చేయడంలో ఇండియా, చైనాల కంటే అమెరికా ఉత్తమంగా పోరాటం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వల్ల ఎక్కువగా భాదింపబడ్డ దేశాల్లో అమెరికా కూడా ఒకటని, అయిన కూడా తిరిగి పుంజుకునే శక్తి తమకుందని ధీమా వ్యక్తం చేశారు. రోజు రోజుకు దేశంలో కొత్తగా నమోదు అవుతున్న కేసుల సంఖ్య తగ్గుతుందని వెల్లడించారు.
అలాగే కరోనాకు సంబంధించిన వాక్సిన్ ను అమెరికానే కనిపెడ్తుందని ధీమా వ్యక్తం చేశారు. బయో టెక్ ఫర్మ్ మోడెరానా తయారు చేస్తున్న వాక్సిన్ సత్ఫలితలను చూపిస్తుందని తెలిపారు. అలాగే అమెరికన్స్ ఉద్యోగాల గురించి బాధపడాల్సిన అవసరం లేదని, స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.