టిక్ టాక్ నిషేధం పై స్పందించిన ట్రంప్
Admin - August 1, 2020 / 05:46 AM IST

టిక్ టాక్ ను అమెరికాలో నిషేధించడం లేదా ఇతర చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీని పై చర్చలు జరుగుతున్నాయని శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. టిక్ టాక్ దేశ ప్రజల సమాచారాన్ని సేకరిస్తుందని, దీని వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అక్కడి కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఇవే కారణాల వల్ల భారతదేశంలో టిక్ టాక్ ను నిషేధించిన విషయం తెలిసిందే.
నిషేదం వైపు ట్రంప్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేయనుందని, దీనికి సంబందించిన చర్చలు రెండు కంపెనీల మధ్య జరుగుతున్నాయని టెక్ వర్గాలు చర్చించుకున్నారు. ఈ కొనుగోలు వ్యవహారం పై టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ , మైక్రోసాఫ్ట్ సంస్థలు ఎలాంటి అధికార ప్రకటన జారీ చేయలేదు.