నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన ట్రంప్

Advertisement

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పరిపాలన విధానంతో ప్రపంచం మొత్తం ప్రాధాన్యం సంతరించుకున్నారు. అయితే ఇప్పుడు నవంబర్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ కు మంచి మైలేజ్ పెంచే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇజ్రాయిల్‌, యూఏఈ మధ్య ఒప్పందం కుదిర్చినందుకు డోనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ ట్రైబిడ్రే జెడ్డే నామినేట్ చేశారు. ఇరు దేశాల మధ్య సామరస్యం నెలకొనేలా కృషిచేశారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలను ట్రంప్‌ పరిష్కరించారంటూ ప్రశంసించారు.

గతంలో కూడా ట్రంప్ నోబెల్ ఇవ్వాలని క్రిస్టియన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఈ వార్త బయటకు రావడంతో ట్రంప్ కు బాగ కలిసి రానుంది. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నోబెల్‌ శాంతి బహుమతి పొందిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతానికి, ప్రజల మధ్య సహకారానికి అసాధారణ కృషికి గాను ఆయనకు ఈ విశిష్ట పురస్కారం దక్కింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here