రానున్న రోజుల్లో ట్రంప్ అలీబాబా యాప్ ను కూడా బ్యాన్ చేయనున్నారా?

Advertisement

ఇండియా-చైనాల మధ్య సరిహద్దు గొడవలు జరిగిన తరువాత భద్రతాపరమైన కారణాల వల్ల టిక్ టాక్ ను ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇండియా తరువాత టిక్ టాక్ ను అమెరికా కూడా బ్యాన్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. టిక్ టాక్ కార్యకలాపాలను అమెరికాకు విక్రయించకపోతే బ్యాన్ చేస్తామని, చెప్తూ మొదట్లో 45 రోజులు గడువు ఇవ్వగా, ఇప్పుడు మళ్ళీ దాన్ని పెంచారు. చైనాపై ఒత్తిడి పెంచేందుకు ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని తాజగా జరిగిన ప్రెస్ మీట్ లో ట్రంప్ తెలిపారు.

చైనాకు చెందిన ఈ-షాపింగ్ యాప్ అలీబాబాను కూడా నిషేధించడానికి ప్రయత్నిస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ…చైనాపై ఒత్తిడి పెంచేందుకు ఎంతవరకైనా వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. బైట్ డాన్స్ తమ దేశపు భద్రతకు భంగం కలిగించిందని చెప్పడానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here