కరోనా శవాలను పీక్కుతింటున్న కుక్కలు, పట్టించుకోని అధికారులు

Advertisement

ఆదిలాబాద్: కరోనా వల్ల ప్రజలందరూ గత కొన్ని నెలలుగా తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. చాలా మంది కరోనాతో పోరాడలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా వల్ల మృతి చెందిన వారి శవాల పట్ల అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు అయింది. కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలకు సరిగ్గా అంత్యక్రియలు నిర్వహించకపోవడం వల్ల సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. కరోనా వల్ల చనిపోయిన వారి దేహాలను గ్రామాల్లోకి రానివ్వకపోవడం వల్ల అధికారులే మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

అయితే ఈ విధుల నిర్వహణలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. శవాలు పూర్తిగా దహనమయ్యాయో లేదో చూసుకోకుండా వాటిని గాలికి వదిలేస్తున్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం కాలిన శవాలను కుక్కలు తింటుంటే చూడలేకపోతున్నామని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here