CAR : మీరు కార్ డాష్ బోర్డు మీద కాళ్ళు పెడుతున్నారా..ఎంత ప్రమాదమో తెలుసా..!!

CAR : కొంతమంది తెలియక కార్ ప్రయాణాల్లో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల వల్ల భారీ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. చిన్న చిన్న తప్పులే అయినా అవి ఎంతో ప్రమాదకరంగా అవుతుంటాయి. ఫలితంగా ఓ జీవితాన్ని బలిఇవ్వాల్సి వస్తుంది.. అలా కార్ లో ప్రయాణించేటప్పుడు ముందు సీట్లో కూర్చున్న వారు రిలాక్స్ అవడం కోసం వారు కార్ డాష్ బోర్డు పై కాళ్ళు పెట్టి రిలాక్స్ అవుతుంటారు. అలా చేస్తే ఎంత ప్రమాదకరమో వారు తెలీక ఆలా చేసుంటారు..

Do You Put Legs On Car Dash Board : కార్
Do You Put Legs On Car Dash Board

అమెరికా లో ఇదేవిధంగా ఓ మహిళా డాష్ బోర్డు పై కాళ్ళు పెట్టి ప్రాణాలమీదకు తెచ్చుకుంది. అంతేకాదు జీవితంలో లేవని విధంగా అయిపొయింది.. మంచానికే పరిమితమైపోయింది.. ఇప్పుడు ఈ తప్పు మీరు చేయొద్దు అని ప్రచారం చేస్తుంది. ఇంతకీ ఏమైందంటే.. భర్త కార్ డ్రైవ్ చేస్తుండగా పక్క సీట్లో కూర్చున్న ఆ లేడీ డాష్ బోర్డు పై కాళ్ళు పెట్టింది.. భర్త వారించడంతో ఆమె కాళ్ళు తీసి కింద పెట్టింది. అయితే కార్ మరింత ముందుకెళ్లాక మళ్ళీ డాష్ బోర్డు పై కాళ్ళు పెట్టింది. దీంతో ఎయిర్ బాగ్స్ ఒక్కసారిగా ఓపెన్ అయ్యాయి.. దీంతో ఆమె కాలు వీరిది ముక్కుకు తాకింది..

దీంతో ఆమె మంచానికి మూడు నెలలు పరిమితమైపోయింది. డాష్ బోర్డు మీద బలంగా కాలు పెడితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడం ఒక ప్రమాదం అయితే , డ్రైవింద్ చేసేవాళ్ళకి అది ఇబ్బంది కలిగి సరిగ్గా డ్రైవ్ చేయకపోవడం మరొక ప్రమాదం.. సో ఇప్పటికైనా డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి..

Advertisement