Krishna : సూపర్ స్టార్ కృష్ణ గురించి ఇది మీకు తెలుసా.?
NQ Staff - November 15, 2022 / 02:24 PM IST

Krishna : సూపర్ స్టార్ కృష్ణ అంటే కేవలం సినీ నటుడు మాత్రమేనని అంతా అనుకుంటారు. కొందరికి మాత్రమే ఆయనకు దర్శకుడని తెలుసు. కృష్ణ పలు సినిమాల్ని నిర్మించిన విషయం కూడా ఈ తరంలో చాలా తక్కువమందికి తెలుసు.
నటుడిగానే కాదు, నిర్మాతగానూ, దర్శకుడిగానూ తెలుగు సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు కృష్ణ. సినిమాకి సంబంధించి సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సూపర్ స్టార్ కృష్ణ తనవంతు కృషి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సినిమా స్కోప్, ఈస్ట్మన్ కలర్, 70ఎంఎం వంటివి కృష్ణ సినిమాలతోనే తెలుగు తెరకు పరిచయమయ్యాయ్.
నటుడు, నిర్మాత, దర్శకుడు మాత్రమే కాదండోయ్..
సూపర్ స్టార్ కృష్ణ కేవలం నటుడు మాత్రమే కాదు. దర్శకుడు, నిర్మాత.. అంతకు మించి చాలా ప్రతిభ వుంది ఆయనలో. కథ, స్క్రీన్ ప్లే కూడా ఆయనే కొన్ని సినిమాలకు సమకూర్చారు. అంతే కాదు, ‘సింహాసనం’ సినిమాకి ఎడిటింగ్ కూడా ఆయనే కావడం గమనార్హం.
కృష్ణ ఏదన్నా సినిమా గురించి ఓ అభిప్రాయం వ్యక్తం చేశారంటే, ఖచ్చితంగా ఆ సినిమా రిజల్ట్ ఆ అభిప్రాయానికి తగ్గట్టుగానే వుండేదట. హిట్, ఫ్లాప్ అని మాత్రమే కాదు. యావరేజ్, ఎబౌ యావరేజ్, బిలో యావరేజ్, హండ్రెడ్ డేస్, అంతకు మించి.. ఇలా అన్నీ పక్కాగా చెప్పేసేవారట.
సినిమా పట్ల సంపూర్ణ పరిజ్ఞానం కృష్ణకి వుండేది. ఈ జనరేషన్ ప్రేక్షకుల నాడి కూడా ఆయన బాగానే అర్థం చేసుకునేవారు. మహేష్ సినిమాల విషయంలోనూ కృష్ణ తదైన జడ్జిమెంట్ పాస్ చేసేవారు.