Old Man : 98 ఏళ్ల వయసులోనూ బఠాణీలు అమ్ముతూ జీవిస్తున్న వృద్ధుడు.. ఎందుకు..!

Old Man(వృద్ధుడు): ఈ రోజుల్లో ప్రతిఒక్కరు ఎంతటి బద్దకస్తులు అయిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యంగ్ ఏజ్ లోనే రిలాక్స్ అయిపోతూ రిటైర్ అయ్యే ఆలోచనలో ఉన్నారు..

Do You Know This A 98 Years Old Man living On His Own Two Feet : వృద్ధుడు
Do You Know This A 98 Years Old Man living On His Own  

అయితే ఓ వృద్ధుడు మాత్రం తన కొడుకు, కూతురు మీద ఆధారపడకుండా 98 ఏళ్ల వయసులోనూ కష్టపడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. రోడ్డు మీద బఠాణీలు అమ్ముతూ తన ఖర్చును థానే సంపాదిస్తూ తోటి మనుషులకు స్ఫూర్తి గ నిలుస్తున్నారు. సాధారణంగా వృద్ధాప్యంలోకి రాగానే ప్రతి ఒక్కరు ఆస్తిని కొడుకు కూతుళ్ళకు పంచి విశ్రాంతి తీసుకుంటారు.

ఇక మన బాధ్యత తీరిపోయింది. ఆ దేవుడు ఇక్కడికి పంపిన కార్యక్రమం పూర్తి అయింది అనుకుని రిలాక్స్ అయిపోయి జీవితం మొత్తం కృష్ణ రామ అనుకుంటూ ఉంటూ ఉంటారు.. కానీ ఉత్తరప్రదేశ్ లో ని రాయ్ బరేలి లో ఒక వృద్ధుడు 98 ఏళ్ల వయసులో తన కాళ్ళమీద తాను బ్రతుకుతున్నాడు. బటానీలు అమ్ముకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాయ్ బరేలి దగ్గర్లోని ఓ గ్రామంలోని రహదారి పక్కన ప్లాట్ ఫామ్ పై నిలబడి వాటిని విక్రయిస్తున్నారు. ఓ వ్యక్తి దీనికి సంబందించిన వీడియో ని సోషల్ మీడియా లో పెట్టగా అది ఫుల్ వైరల్ గా మారింది..

ఆ వీడియోలో వృద్ధుడు ఎంతో సీరియస్ గ బటానీలు సర్దుతూ ఉన్నాడు. పనిపై శ్రద్ధతో ఉన్న ఆ వృద్ధిడిని చూస్తే ఎవరికైనా ఆ వీడియో నచ్చుతుంది. అంతేకాకుండా ఆ వీడియో లో కొన్ని ప్రశ్నలు వేయగా ఎందుకు ఈ వయసులో ఈ పనిచేస్తున్నావన్న ప్రశ్నకు నా కుటుంబం చాలా పెద్దది, ఊరికే ఇంట్లో కూర్చొని తినడం నాకిష్టం లేదని , అది నా బలహీనత అవుతుందని అందుకే తాను ఇలా కష్టపడుతున్నా అని వివరించాడు. ఆయనను జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి ఆహ్వానించి 11,000 నగదు బహుమతి అందించారు. ఆయనకు వాకింగ్ స్టిక్, శాలువ, సర్టిఫికేట్ కూడా రాబరేలి జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్ శ్రీవాస్తవ అందించారు. ప్రభుత్వం ఓ ఇల్లు కూడా ఇచ్చిందని అయన అన్నారు.

Advertisement