Alcohol : బీర్, వైన్, బ్రాందీ, విస్కీ , స్కాచ్.. కిక్ ఒక్కటే.. ఎందుకిన్ని పేర్లు..?

Alcohol : ఈమధ్య మద్యం ఏవిధంగా అమ్ముడవుతుందో అందరికి తెలిసిందే.. ఏదైనా ఈవెంట్, అకేషన్ వచ్చిందంటే చాలు మద్యం ఏరులైపారాల్సిందే.. పార్టీ లు, పండగలు ఏదొచ్చినా బీర్ పొంగాల్సిందే.. వైన్ తో చిందులేయాల్సిందే.. బ్రాందీ లేనిదే పార్టీ మొదలవ్వదు.. విస్కీ తాగనిదే పార్టీ ఎండ్ అవని రోజులివి.. అలంటి ఆల్కాహాల్ లో చాలా వెరైటీ లు ఉన్నాయి. బ్రాండ్ లు వేరు.. రకాలు వేరు.. ఒకే రకమైన ఆల్కహాల్ ని చాల కంపెనీలు తమ బ్రాండ్ తో తయారు చేస్తాయి.

Do You Know The Process of Brand ,Beer, Whisky Making Process : ఆల్కహాల్
Do You Know The Process of Brand, Beer, Whisky Making Process

బీర్, వైన్, బ్రాందీ, విస్కీ , స్కాచ్ ఇలా చాలా వెరైటీ లు ఆల్కహాల్ లో కనిపిస్తాయి. అన్ని తాగితే ఒకటే కిక్ కానీ పేర్లే డిఫరెంట్ గ ఉన్నాయి. మరి ఇవి ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయి..వీటిని ఎందుకలా పిలుస్తారో ఎలా తయారుచేస్తారో చూద్దాం.. బీర్ తయారీకి ఎక్కువ గా ఉపయోగించే పదార్థం మాల్ట్ అంటే బార్లీ, గోధుమ… ఈ పదార్థాలను ఉపయోగించి బీర్ ను తయారు చేస్తారు.. బీర్ తయారు చేసే పద్ధతి ని బ్రూయింగ్ అంటారు. మాల్ట్ ను పులియబెట్టి బీర్
ని తయారు చేస్తారు.

ద్రాక్ష ను పులియబెట్టి వైన్ ని తయారు చేస్తారు. ద్రాక్ష అనే కాకుండా తాజాగా మార్కెట్ లోకి కొన్ని ఫ్లేవర్లు కూడా వచ్చాయి.. వివిధ రకాల పండ్ల ను పులియబెట్టి తయారు చేస్తారు.. పండు ఏదైనా పద్ధతి మాత్రం ఒక్కటే.. షాంపేన్ ను కొంత వెరైటీ గా తయారు చేస్తారు. వైన్ ను మరోసారి పులియబెడితే వచ్చే పానీయమే షాంపేన్.. ఇది ఫ్రాన్స్‌లోని షాంపైన్ అనే జిల్లా నుండి వచ్చింది కాబ‌ట్టి దానికి అదే పేరు ఫిక్స్ అయ్యింది. వైన్ ను మరింత శుద్ధి చేయగా వచ్చే ఆ ద్రవాన్ని బ్రాందీ అంటారు. ఇక మనదేశంలో ఎక్కువగా వినియోగించే విస్కీ లో ప్రధాన పదార్థం మాష్ ఆఫ్ ఫెర్మెంటెడ్ గ్రెయిన్ (గోధుమ, బార్లీ మొదలైనవి) ను ఎక్కువగా ఉపయోగిస్తారు. స్కాచ్ కొంత డిఫరెంట్ గా తయారుచేయబడుతుంది.. 3 సంవ‌త్స‌రాల పాత విస్కీయే స్కాచ్.. రమ్ లో మొలాసిస్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. బ్రాండ్ ఏదైనా, టైపు ఏదైనా ఒక్క పెగ్గు వేస్తే కిక్కే..కిక్కు..

Advertisement