India Pak :అయన చేసిన చిన్న పొరపాటు వల్లే ఇండియా పాకిస్థాన్ విడిపోయిందా!!

India Pak :భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో మంది గొప్పవారు ప్రాణత్యాగం చేశారు.. స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో సుఖ సంతోషాలతో దేశం వర్ధిల్లుతుంది అనుకున్నారు. కానీ స్వాతంత్య్రం వచ్చిందో లేదో భారతదేశం రెండు ముక్కలైంది.. మత విద్వేషాలతో దేశంలో రెండు మతాలైన హిందూ, ముస్లిం ల మతాల ప్రజలు విద్వంసాన్ని సృష్టించి స్వాతంత్య్రం వచ్చిందన్న సంతోషాన్ని ఎన్నో రోజులు లేకుండా చేశారు. ఫలితంగా దేశం రెండు ముక్కలైంది.. ఒకటి ఇండియా మరొకటి పాకిస్థాన్..

Do you Know The India Pak Radcliffline story : ఇండియా పాకిస్థాన్
Do you Know The India Pak Radcliffline story

అయితే విడిపోవడం అయితే విడిపోయింది కానీ దీన్ని భౌగోళికంగా ఎలా విడగొట్టాలి. దీనికి ఎవరు కరెక్ట్ అని ఆలోచించిన మౌంట్ బాటెన్ బ్రిటన్ నుండి రాడ్ క్లిఫ్ ను పిలిపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ముగియకముందే రాడ్ క్లిఫ్ ఇండియాకి వచ్చి కేవలం నలభై రోజుల్లోనే ఇండియా పాకిస్థాన్ ల మధ్య సరిహద్దు రేఖ ను గీశాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే దేశ విభజన చేయడానికి ముందు రాడ్ క్లిఫ్ దేశానికి ఒక్కసారి కూడా వచ్చింది లేదు. కొద్దీ మంది ఇచ్చిన సమాచారంతో తన టేబుల్ మీద మ్యాప్ ను చూస్తూ రెండు దేశాలను విభజిస్తూ ఓ రేఖ గీశాడు.

అదే ఇండియా పాక్ ల మధ్య ప్రామాణిక సరిహద్దు రేఖ గా మారిపోయింది. రాడ్ క్లిఫ్ గీశాడు కాబట్టి దాన్ని రాడ్ క్లిఫ్ అనే పేరు పడిపోయింది. ఈ విభజన రేఖ ఒకే ఇంట్లో కొన్ని గదుల్ని భరత్ కు, మరికొన్ని గదుల్ని పాకిస్థాన్ కు కూడా కేటాయిస్తూ సాగిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. విభజన రేఖ ను గీసినందుకు రాడ్ క్లిఫ్ కు 1947 లోనే 3000 పౌండ్స్ తీసుకోవాల్సిందిగా ఆఫర్ చేశారు. అయినప్పటికీ ఆ ఆఫర్ ని అయన తిరస్కరించారు.

Advertisement