Soundarya: ఒక్కప్పడు సౌందర్య నివసించిన ఇల్లు ఇప్పుడు బూతు బంగ్లాగా మారడానికి కారణం ఏంటి..??

Mamatha 600 - March 18, 2021 / 08:16 PM IST

Soundarya: ఒక్కప్పడు సౌందర్య నివసించిన ఇల్లు ఇప్పుడు బూతు బంగ్లాగా మారడానికి కారణం ఏంటి..??

Soundarya(సౌందర్య) : తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పరిపూర్ణ నటిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు అలనాటి నటి సౌందర్య..100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. పేరుకు కన్నడ కస్తూరి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది ఈమె. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేది.. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె. మరణించి 17 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈమెను మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్.

Do You Know the Condition of Heroine Soundarya House

Do You Know the Condition of Heroine Soundarya House

చనిపోయేనాటికి సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే.. పైగా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది…ఇక తాజాగా నటి సౌందర్య స్నేహితురాలు మరియు ఒకప్పటి టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ “ఆమని” ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని నటి సౌందర్య గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.ఇందులో భాగంగా నటి సౌందర్య కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పటి నుంచే హీరోయిన్ కావాలని చాలా కష్టపడిందని తెలిపింది. అంతేగాక సౌందర్య కి తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని, దాంతో తన తండ్రి మాటకి సౌందర్య ఎప్పుడూ కూడా ఎదురు చెప్పేది కాదని అంతగా తన తండ్రిని ప్రేమించేదని చెప్పుకొచ్చింది…

అంతేకాకుండా నటి సౌందర్య ఒకప్పుడు బెంగళూరులో నివసించిన తన సొంత ఇల్లు ప్రస్తుతం పట్టించుకునేవారు లేక బూత్ బంగ్లా గా మారిపోయిందని, క్రితం సారి వెళ్ళినప్పుడు తాను చూశానని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది.ఎప్పుడూ కూడా నటి సౌందర్య తనతో ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునేదని, తనకి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అత్యంత సన్నిహితులలో సౌందర్య ఒకరని తెలిపింది.అయితే సౌందర్య హీరోయిన్ కావడానికి ఎంతగా కష్ట పడిందోనని, కానీ ఆ స్టార్ డమ్ అనుభవించకుండానే కన్నుమూసిందని అందుకు తనకు ఇప్పటికీ ఎంతో బాధగా ఉందని చెప్పుకొచ్చింది ఆమని..ఇక ప్రస్తుతం ఈమె చావు కబురు చల్లగా అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది.. ఈ సినిమా మార్చి19 న విడుదల కానుంది…!!

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us