NTR : సీనియర్ ఎన్టీఆర్ గారికి ఎంతమంది మనవరాళ్లు ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??

NTR (ఎన్టీఆర్ ) : తెలుగు చిత్ర పరిశ్రమలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రతీ ఒక్క తెలుగు ప్రేక్షకుడికి తెలియంది కాదు.. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది.

Do You Know NTR Daughters, Sons And Grand Daughters Names: ఎన్టీఆర్
Do You Know NTR Daughters, Sons And Grand Daughters Names

తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.. నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా…రాజకీయ వేత్తగా….ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి. నాటకాలతో అప్పటికే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు రామారావు. అతనిలోని నటుడ్ని గుర్తించిన ప్రముఖ దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు ‘పల్లెటూరిపిల్ల’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఆలస్యం కావడంతో ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో ‘మనదేశం’ సినిమా లో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అలా.. ఎన్టీఆర్ నటించిన తొలిచిత్రం ‘మనదేశం’ అయ్యింది. 1949లో వచ్చిన ఆ మూవీలో ఒక పోలీస్ ఇన్స్ స్పెక్టర్ పాత్ర పోషించాడు.

ఆ తర్వాత 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే ఏడాది విజయా ప్రొడక్షన్ సంస్థ ఎన్టీఆర్, జానకి హీరోహీరోయిన్లుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘షావుకారు’ నిర్మించారు.విజయా సంస్థ తో కుదిరిన ఒప్పందంతో ఎన్టీఆర్ ఆ బ్యానర్ కు ఆస్థాన నటుడయ్యాడు. 1951లో కె.వి.రెడ్డి డైరెక్షన్ లో విజయా వారు నిర్మించిన ‘పాతాళ భైరవి’ నటుడిగా ఎన్టీఆర్‌కు తిరుగులేని స్టార్ డమ్ తీసుకొచ్చింది.అక్కడితో తన విజయాల పరంపర ఆగలేదు.. ఏకంగా మహనటుడిగా పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు అదే పరంపరని ఆయన కొడుకులు, మనవళ్లు కొనసాగిస్తున్నారు.. ఇదిలా ఉంటెఎన్టీఆర్ గారికి ఏడుగురు కొడుకులు నలుగురు కూతుళ్లు..తన కొడుకులందరికి చివర్లో కృష్ణ అని కలిసేట్లుగా వాళ్ళ పేర్లు పెట్టారు..వాళ్లే జయ కృష్ణ, హరి కృష్ణ, రామకృష్ణ, మోహన కృష్ణ బాలకృష్ణ, జయశంకర కృష్ణ, సాయి కృష్ణ..

వీళ్ళలో హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరూ మనకు తెలుసు.. ఎందుకంటే వాళ్ళు హీరోలుగా రాణించినవారే..ఇక కేవలం వీళ్లకు మాత్రమే కాదు వీళ్ళ పిల్లలకు కూడా కలిసొచ్చే పేర్లే పెట్టారు.. అవేంటంటే..జయకృష్ణ కి ఒక కూతురు ఆమె పేరు కుముదిని, అలాగే హరికృష్ణ కి ఒక కూతురు.. ఆమె పేరు మొదట్లో వెంకట రామమ్మ అని పెట్టినప్పటికి తర్వాత మాత్రం సుహాసిని అని పెట్టారు.. ఇక బాలకృష్ణ కి ఇద్దరు కూతుళ్లు..పెద్ద అమ్మాయి బ్రహ్మీణి, చిన్న అమ్మాయి తేజస్విని..అలాగే సాయి కృష్ణ కూతురు పేరు ఇషాని..మొత్తానికి ఇలాంటి పేర్లని బట్టి తెలుగు భాషపై తనకు ఎంత ప్రేముందో నిరూపించారు ఎన్టీఆర్ గారు…!!

Advertisement
Advertisement