Promisery Note : ప్రామిసరీ నోటు ఇలా రాయండి.. లేదంటే అప్పు ఎగ్గొట్టేస్తారు..!!

Promisery Note(ప్రామిసరీ నోటు ) : ఈమధ్య అప్పు తీసుకోవడాలు, అప్పు ఇవ్వడాలు జరగడం సాధారణం అయిపోయాయి.. ఒకప్పుడు ఈ అప్పు లావాదేవీలకు ప్రామిసరీ నోట్ లాంటివి ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా వాడుతున్నారు కానీ ఎక్కువగా డిజిటల్ అయ్యేసరికి పేమెంట్ యాప్స్ ని ఎక్కువగా నమ్ముతున్నారు.. అయితే ఇది ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి ప్రామిసరీ నోట్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.. అయితే ఈ ప్రామిసరీ నోట్ కూడా సవ్యంగా ప్రిపేర్ చేయకపోతే మీరిచ్చిన అప్పు అంతేసంగతులు అంటున్నారు నిపుణులు..

Do You Know How To Write Promisery Note : ప్రామిసరీ నోటు
Do You Know How To Write Promisery Note

ప్రామిసరీ నోటు ప్రిపేర్ చేయడంలో కూడా ఎంతో జాగ్రత్త వ్యవహరించాలి. లేదంటే అప్పు ఎగ్గొట్టిన మనం చేసేదేం ఉండదు.. మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఆ నోటు చిత్తు కాగితంగా మారుతుంది. అయితే మీరిచ్చిన అప్పుడు ఎగ్గొట్టడానికి వీలులేకుండా ప్రామిసరీ నోటు ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదాహరణకు నేను ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను. ఆ అప్పును ను నేను తీసుకున్న వ్యక్తి కి తిరిగి ఇస్తాను అనే పాయింట్ తప్పకుండా ఉండాలి. రెండు పార్టీ లకీ 18 సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలి..

ఒకవేళ అప్పు పాత్ర మతి స్థిమితం లేనివారు రాస్తే అది చెల్లదు. అప్పు పత్రం రాసేటప్పుడు తప్పకుండా ఇద్దరు సాక్ష్యులు ఉండాలి అని గుర్తిపెట్టుకోండి. రెవెన్యూ స్టాంప్ అతికించి ఖచ్చితంగా స్థంప్ పై అడ్డంగా సంతకం చేయాలి. ప్రామిసర్ నోట్ కి మూడేళ్ళ కాలపరిమితి ఉంటుంది. ఒక్క ప్రామిసరీ నోట్ పై కోటి రూపాయల అప్పు ఇవ్వొచ్చు. ఒకవేళ అప్పు ఎగ్గొడదామని చూస్తే ఆ ప్రామిసరీ నోట్ తో న్యాయపరమైన చర్యలు తీసుకుని డబ్బు రాబట్టుకోవచ్చు. చిన్న మొత్తంలో కాకుండా పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చేటప్పుడు న్యాయవాది ఉండడం మేలు.

Advertisement