China Fast Food : చైనా ఫాస్ట్ ఫుడ్ ఇండియా లో అలవాటు అవడానికి కారణం..!!

China Fast Food (చైనా ఫాస్ట్ ఫుడ్): ఈరోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అంటే అమితమైన ఇష్టం ఉంటుంది ప్రజలకి.. సాయంత్రం అయితే చాలు ఈరకమైన ఫాస్ట్ ఫుడ్ కి ఎగబడుతున్నారు. పిల్లలు అయితే ఇంకా ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్ కి అలవాటుపడుతున్నారు.. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటూ వింత వంటకాలు అన్ని తింటూ ఆరోగ్యాన్ని లెక్కచేయట్లేదు.. నిజానికి ఈ ఫాస్ట్ ఫుడ్ ఇంత ఫేమస్ అవడానికి కారణం వాటి రుచి… తక్కువ సమయంలో అంత రుచికరమైన వంటకం తినడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Do You Know How China Fast Food Come To India : చైనా ఫాస్ట్ ఫుడ్
Do You Know How China Fast Food Came To India

మరి ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కడ పుట్టింది.. అది ఇండియాకి ఎలా వచ్చింది.. తక్కువ టైం లో ఇంత షెరవేగంగా విస్తరించిన ఈ వంటకానికి తెరలేపింది చైనానే.. చైనావస్తువుల్లాగానే చైనా వంటకాలు కూడా మన భారతీయ వంటకాలను పక్కకు తోసి నెంబర్ వన్ గానిలిచింది. అలాంటి ఈ ఫాస్ట్ ఫుడ్ ఇండియా కి ఎలా వచ్చి పాతుకుపోయిందో ఉప్పుడు చూద్దాం. 17 వ శతాబ్దంలోనే ఇండియాకి ఈ ఫుడ్ పరిచయమైంది. కలకత్తా కేంద్రం గా వారు వ్యాపారం చేస్తున్న టైం లో చైనీయుల రాకపోకలు జరిగాయి..

అప్పుడు వారు కానుకగా చైనీయుల సాంప్రదాయ వంటలను తీసుకొచ్చేవారు. అలా వారి ఆహరం ఇక్కడి వారికి అలవాటైంది. తర్వాత పార్టీల్లో, విందుల్లో దీన్ని స్పెషల్ డిష్ గా ప్రత్యేక వంటకాలు గా పరిచయం చేసేవారు. రాజ్ కపూర్, న‌ర్గీస్,దిలీప్ కుమార్ లు 1925 లో ముంబై లో చైనా వంటకాలతో రెస్టారెంట్ ఓపెన్ చేయగా విపరీతమైన డిమాండ్ వచ్చిదని. మంచూరియ ను 1975 లో చైనా నుండి ముంబై కి పరిచయం చేశారు. నెల్స‌న్ వాంగ్ అనే వ్యక్తి ఈ డిష్ ను స్పెషల్ వంటకంగా పరిచయం చేసి బాగా గడించాడు.. ఇలా ఒక్కో పరిణామంలో ఒక్కో ఐటెం మన ఇండియా లో పాతుకుపోయింది.

Advertisement