BYJUS App : బై జూస్ యాప్ ఓనర్ ఎవరో తెలుసా…ఎంత సంపాదిస్తున్నాడంటే..!!

BYJUS App (బై జూస్ యాప్): ప్రస్తుతం కరోనా నేపథ్యంలో స్కూల్స్ మూతపడిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఆన్ లైన్ లో క్లాసులు చెప్పడం మొదలుపెట్టారు టీచర్స్.. దాదాపు అన్ని స్కూల్స్ కూడా ఆన్ లైన్ లో క్లాసులు చెప్తూ విద్య సంవత్సరాన్ని కొనసాగిస్తున్నాయి.

Do You Know BYJUS App Owner And his Owner : బై జూస్ యాప్
Do You Know BYJUS App And his Owner

స్కూల్స్ లో కాకుండా ఆన్ లైన్ లో కొన్ని యాప్స్ కూడా పిల్లలకి మంచి విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. అందులో మొదట స్థానంలో బై జూస్ యాప్ తప్పకుండా ఉంటుంది.. షారుక్ ఖాన్ , మహేష్ బాబు దీనికి ప్రమోషన్ ఇచ్చారంటే ఈ యాప్ లో పిల్లలకు ఉపయోగపడే కంటెంట్ చాలా ఉందని అర్థం చేసుకోవచ్చు..

ఇంత తక్కువ టైం లోనే ఈ యాప్ ఇంత డెవలప్ అవడానికి కారణాలు అన్వేషిస్తే అందులో ప్రధానంగా కరోనా అని తెలుస్తుంది. లాక్ డౌన్ లో పిల్లలకు మంచి విజ్ఞానం పంచిన ఈ యాప్ ఓనర్ ఎవరు.. అసలు యాప్ ఎలా డిజైన్ చేశాడు.. ఆలోచన ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. దీని ఓనర్ పేరు బైజు రవీంద్రన్.. తాజగా ఈయన దేశపు యువ బిలియనీర్ గా రికార్డు సృష్టించాడు. 2003 లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రవీంద్రన్ విద్యార్థులకు గణితంలో పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. కామన్ ఎంట్రన్స్ లో వందశాతం స్కోర్ నూనమోదు చేసుకున్నాడు కూడా..

ఆ తర్వాత రెండేళ్లకు టీచింగ్ వృత్తిలోకి వెళ్ళాడు.. అక్కడ దివ్య గోకుల్ నాథ్ రవీంద్రన్ కు పరిచయమైంది. వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకున్నారు.. 2015 లో బైజూస్ యాప్ ని లాంచ్ చేశారు. అప్పటినుంచి ఈ యాప్ కి మంచి ఆదరణ లభించింది. ఆన్ లైన్ లో చాలా సులభంగా నేర్చుకునే విధంగా ఉండడంతో పిల్లలు ఈ యాప్ యూజ్ చేయడానికి అలవాటుపడ్డారు.. ప్రస్తుతం ఈ యాప్ ను 6 .4 కోట్లమంది డౌన్లోడ్ చేసుకున్నారు. మూడు కోట్ల మంది విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 3 .05 బిలియన్ డాలర్ లుగా ఉంది. దీంతో పిన్నవయసులోనే బిలియనీర్ గా ఎదిగిన ధనికుడు అయ్యాడు రవీంద్రన్..

Advertisement