Machine: తుప్పుపట్టిన పరికరం లాగ ఉన్న ఈ యంత్రం గురించి తెలుసా..?

Machine(పరికరం ) : ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి మన పనులు త్వరగా, సౌకర్యవంతంగా, సులభంగా జరిగిపోతున్నాయి.. అయితే తరాలుగా వస్తువులను కనిపెట్టడం వాటి ద్వారా మన పనులు చేసుకోవడం అనాది కాలం నుండి వస్తూనే ఉన్నాయి.. పూర్వ కాలంలో కూడా అప్పటి స్థాయికి తగ్గట్లు యంత్రాలను కనిపెట్టారు.. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే సైజ్.. ఇప్పటి కంటే అప్పటి సైజులు పెద్దవిగా ఉండొచ్చు.. కానీ పరిమాణంలో తేడా ఉన్నా పనిలో మాత్రం నేను తేడా ఉండదు..

do you know about this rustic machine :  పరికరం
do you know about this rustic machine

ఇప్పటి స్మార్ట్ కంప్యూటర్ ని పోలి ఉన్న అప్పటి ఎనలాగ్ కంప్యూటర్ ఈ ఫోటోలో మీకు చూపిస్తున్న తుప్పు పరికరం.. తుప్పు పట్టి పోయింది ఇది ఎనలాగ్ కంప్యూట రా అని సందేహం కలగవచ్చు.. అయితే అలా ఉన్నా కూడా మీరు ఇది ఎనలాగ్ కంప్యూటర్ అంటే నమ్మాల్సిందే.. దీన్ని యాంటీ కైతేరా అని పిలుస్తారు.. 1901లో వద్ద సముద్రంలో మునిగి పోయిన దీన్ని కనుగొన్నారు.. ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది కాకపోతే కొందరు కొత్తగా నిర్మించే పనిలో పడ్డారు..

ఈ పరికరాన్ని క్రీస్తుపూర్వం 70- 60 సంవత్సరాల మధ్య తయారు చేసినట్లు చెబుతున్నారు.. దీన్ని అప్పట్లో చంద్రుడు తన కక్ష్యలో తిరిగే విధానంతో పాటు గ్రహలు, గ్రహణాలు ఇతర విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగించారు.. ఇప్పుడు చాలా అధునాతన పరికరాలు ఉన్నప్పటికీ అప్పట్లో ఈ పరికరం ద్వారా ఆయా విషయాలను కచ్చితత్వంతో తెలుసుకునేవారు.. కాగా క్రీస్తుపూర్వం నాలుగు వందల నుంచి రెండు వందల ఇరవై సంవత్సరాల మధ్య ఉపయోగించిన క్రాస్ బోను కూడా తూర్పు ఆసియాలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన తవ్వకాల్లో కనుగొన్నారు..

Advertisement