Ratnam Pens: రత్నం పెన్ను గురించి తెలిస్తే ఇకపై ఈ పెన్ను నే వాడతారు..!!

Ratnam Pens( రత్నం పెన్ను ): నిత్యం మనం వాడే కొన్ని వస్తువులలో పెన్ను ఒకటి.. సగటు మానవుని జీవన విధానంలో పెన్ను ఎంతో ముఖ్య పాత్ర వహిస్తోంది.. అలాంటి పెన్నులు మార్కెట్లో మనకు చాలా రకాలుగా వేలకొలది కంపెనీలు అందిస్తున్నాయి.. వివిధ రకాల మోడల్స్ తో, వివిధ రకాల డిజైన్స్ తో ఈ పెన్నులు మనం అందరినీ ఎంతో ఆకర్షిస్తాయి.. కొంతమందికి కలాన్ని గ్యాదర్ చేసే అలవాటు కూడా ఉంటుంది.. ముఖ్యంగా రచయితలు కలం అంటే పడి చచ్చిపోతారు.. వారి జీవన విధానంలో ముఖ్య పాత్ర వహిస్తున్న ఈ కలం కు ఆ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే..

Do You Know About Ratnam Pen : రత్నం పెన్ను
Do You Know About Ratnam Pen

అలాంటి పెన్నులలో మనం ప్రముఖమైనదిగా చెప్పుకుంటాము రత్నం పెన్నులు.. ఈ రత్నం పెన్నులను మొట్టమొదటిసారిగా మహాత్మాగాంధీ వాడినట్లు రత్నం పెన్నుల తయారీ సంస్థ అధినేత కె వి రత్నం గారు తెలిపారు .. గాంధీ గారు స్వదేశీ వస్తువులను వాడమని చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని పూర్తి స్వదేశీ వస్తువులతో తయారు చేసి స్వయంగా గాంధీజీ గారికి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.. మరి ఈ రత్నం పెన్నుల ప్రాముఖ్యత ఏమిటి? వాటిని ఎవరు తయారు చేస్తారు? ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం..

ఈ రత్నం పెన్నుల తయారీకి పూర్తిగా స్వదేశీ వస్తువులను వాడడం ఈ పెన్నుల యొక్క ప్రత్యేకత.. 1932 వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కె.వి రత్నం పూర్తి స్వదేశీ వస్తువుల తో తయారు చేయడం ప్రారంభించారు.. మొట్టమొదటిసారిగా గాంధీజీ గారు ఈ రత్నం పెన్ను వాడారు అప్పటి నుంచి మన దేశ రాష్ట్రపతులు ప్రధాన మంత్రులు వారి ప్రమాణస్వీకారోత్సవం రోజున ఈ పెన్నులను ఉపయోగిస్తున్నారు.. రత్నం పెన్నుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.. ఈ పెన్నుల తయారీ విధానాన్ని బట్టి వాటి ఖరీదు కూడా నిర్ణయిస్తారు 300 రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకు ఈ పెన్నులు అందుబాటులో ఉన్నాయి.. వీటిని ప్రత్యేకమైన వెండి బంగారంతో తయారు చేస్తారు అందుకే ఈ పండుగకు ఇంత ధర ఉంటుంది..

Advertisement