టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు బాబు ఇస్తాడా!

Advertisement

అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆ విజయంతో దేశ రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా తెలుగుదేశం వైపు తిరిగి చూశాయి. అలాంటి పార్టీ పరిస్థితి 2019 ఎన్నికల తరువాత చాలా దీన స్థితికి చేరుకుంది. పతనానికి చాలా చేరువలో ఉంది. కనీసం ప్రధాన ప్రతిపక్ష స్థానంలో నిలవడానికి కూడా పార్టీ పెద్ద చంద్రబాబు నాయుడు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ సమయంలో పార్టీలో ఉత్సహం రావాలంటే పార్టీకి నూతన యువ నాయకుడు అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు, పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలను ఎన్టీఆర్ వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలని పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడుకు సలహాలు ఇస్తున్నారని సమాచారం. అలాగే వైసీపీ నాయకుడైన కొడాలి నాని లాంటి వారు కూడా రాష్ట్రంలో టీడీపీ బ్రతకాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావలసిందేనని వ్యాఖ్యానిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే కొడుకు నారా లోకేష్ ను కాదని ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు ఇవ్వడని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పుడు వచ్చిన స్పందన అంత ఇంతా కాదు. ఇప్పుడు పార్టీన్ బ్రతికించడానికి బాబు ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు ఇస్తాడో లేదో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here