శిరోముండనం కేసులో నూతన్ నాయుడిని ప్రభుత్వమే తప్పిస్తుందా ?

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో కొత్త సంప్రదాయం మొదలైంది. అదేంటంటే దళితలపై అనవసరపు ఆరోపణలు మోపుతూ వారికి శిరోముండనం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలపై ప్రభుత్వం చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో ఒకసారి జగిరితే ఆ యువకుడు ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశాడు. అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో మరో ఘటన వెలుగు చూసింది. ఈసారి ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విశాఖలో శ్రీకాంత్ అనే యువకుడికి బిగ్ బాస్ లో పాల్గొన్న నూతన్ నాయుడు ఇంట్లో శిరోముండనం చేశారు.

ఈ శిరోముండనం కేసులో నూతన్ నాయుడి భార్య.. ఇతర పని వాళ్లు నిందితులయ్యారు. నూతన్ నాయుడిపై మాత్రం.. కేసు నమోదు కాలేదు. ఈ అంశంపై రాజకీయ పార్టీల మధ్య రగడ జరుగుతోంది. నూతన్ నాయుడు వైసీపీ సిద్ధాంతకర్త కాబట్టే.. ఆయనను అరెస్ట్ చేయలేదా..? అని టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. నూతన్ నాయుడి ఆదేశాలు లేకుండా కుటుంబ సభ్యులు ఈ దారుణానికి పాల్పడరని, ఈ దుశ్చర్యకు నూతన్ నాయుడే కారణం కాబట్టి ఆయనకు అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here