CM KCR: కేసీఆర్ పొలిటికల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్న మజ్లిస్?

cm kcr
cm kcr

CM KCR టీఆరెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇన్నాళ్లూ పొలిటికల్ గా రెండు ప్లస్ పాయింట్లు ఉండేవి. ఒకటి.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ బలహీనంగా ఉండటం. రెండు.. హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ స్నేహంగా మెలగటం. కానీ.. ఇప్పుడు ఈ రెండే ఆయనకు మైనస్ పాయింట్లు కానున్నాయి. చివరికి కేసీఆర్ రాజకీయాలకే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా రావొచ్చు. దీనికి ప్రధానంగా మజ్లిస్ పార్టీయే కారణం కాబోతోంది.

హిందుత్వం..

దేశవ్యాప్తంగా కమలం పార్టీ అమలుచేస్తున్న అజెండా హిందుత్వం. అదే పాలసీని తెలంగాణలోనూ పాటిస్తోంది. ఫలితంగా కేసీఆర్ హిందువులకు దూరం కావాల్సి వస్తోంది. ఎంఐఎం పార్టీతో అంటకాగకుండా దానిపట్ల కాస్త కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఆయన బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేడనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బదులు బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నందున అధికార పార్టీ టీఆరెస్ కి రెండు వైపులా (పాలన, పాలిటిక్స్ కోణాల్లో) ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గులాబీ పార్టీ మజ్లిస్ తో కలిసి హిందువులకి చేస్తున్న అన్యాయాన్ని కాషాయం పార్టీవాళ్లు కళ్లకు కడుతున్నారు.

ఆ ఇద్దరూ..

హిందుత్వం యాంగిల్ లో కేసీఆర్ ని ఈమధ్య ఇద్దరు బీజేపీ నేతలు టార్గెట్ చేశారు. ఒకరు.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇంకొకరు.. విజయశాంతి. గోవుల్ని అక్రమంగా కబేళాలకు తరలించకుండా రాజాసింగ్ సమర్థంగా అడ్డుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన పోలీసులను సైతం లెక్క చేయట్లేదు. నిన్నగాక మొన్న ‘రాములమ్మ’ విజయశాంతి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎంకి ఓట్ల సమయంలోనే హిందువులు గుర్తొస్తారని, వాళ్లను వలలో వేసుకోవటానికి యాగాలు చేస్తారని దెప్పిపొడిచారు. పూజలతో హడావుడి చేసే కేసీఆర్ కి గోమాత మాత్రం ఎందుకు దైవంగా కనిపించట్లేదని నిలదీశారు. ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ నుంచి కౌంటర్లు రాకపోవటం గమనార్హం.

నార్త్ ఎఫెక్ట్..

తెలంగాణపై క్రమంగా ఉత్తరాది ప్రభావం పెరుగుతోంది. అందువల్ల హిందుత్వంపై టీఆరెస్ వెనకడుగు వేయకుండా ఉండాలంటే ఎంఐఎంతో స్నేహం చేయకుండా ఉండటం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. హైదరాబాద్ ని ఒక్కదాన్నే చూసుకుంటే తెలంగాణ జిల్లాల్లో హిందుత్వవాదులు టీఆరెస్ కి దూరమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దుబ్బాకలో ఈ విషయం తేలిపోయింది. నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్ లోనూ ఇదే ఫలితం వస్తుందా అనేది చూడాలి. అప్పుడైనా మజ్లిస్ పార్టీని కేసీఆర్ పక్కన పెట్టాలని చెబుతున్నారు.

Advertisement