విశాఖకు మావోయిస్టుల ముప్పు ఉందా! జగన్ కు వాళ్లకు బుద్ది చెప్తారా!

Advertisement

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి శ్రీకారం చుట్టి దాన్ని అమలు చేయడానికి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు నియమించిన పరిపాలన రాజధాని విశాఖకు ఒక ముప్పు వచ్చింది. విశాఖకు తీవ్రవాదుల ముప్పు ఉందని కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది.
ఏపీలో ఉన్న పదమూడు జిల్లాలలో తూర్పు గోదావారి తరువాత భౌగోళికంగా పెద్దది. పైగా ఏజెన్సీ ప్రాంతం కూడా ఎక్కువ. దాంతో వామపక్ష తీవ్రవాదం విశాఖ జిల్లాకు అతి పెద్ద సమస్యగా ఉంది.

ఒడిషా నుంచి విశాఖ వరకూ ఉన్న ప్రాంతం మావోలకు పట్టుకొమ్మగా చెబుతారు. ఇపుడు కేంద్రం కూడా మరోసారి విశాఖకు ఆ ముప్పు ఉందని నివేదిక ఇచ్చింది. ఇప్పటికే భద్రతా పరమైన ఏర్పాట్ల కోసం కేంద్రం రూ. 95కోట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే విశాఖను వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతంగా పరిగణిస్తూ కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను కూడా అధికారులు గుర్తించారు. ఈ ముప్పు నుండి విశాఖను జగన్ ఎలా తప్పిస్తారోనని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here