‘ దిశా-ఎన్ కౌంటర్’ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన రాం గోపాల్ వర్మ

Advertisement

కరోనా సమయంలో కూడా నిరంతరం పని చేస్తున్న వారిలో దర్శకుడు రాం గోపాల్ వర్మ ఒకరు. లాక్ డౌన్ సమయంలో కూడా ఆయన మూవీస్ విడుదల చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఆర్జీవీవరల్డ్ థియేటర్ అనే ఒక ఆన్లైన్ థియేటర్ ను ఏర్పాటు చేసి అందులో తన మూవీస్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే క్లైమాక్స్, పవర్ స్టార్, ఎన్ ఎన్ఎన్, థ్రిల్లర్ లాంటి మూవీస్ ను విడుదల చేశారు.

అయితే ఈ రోజు దర్శకుడు రాం గోపాల్ వర్మ తాను తీస్తున్న కొత్త చిత్రమైన ‘దిశా-ఎన్ కౌంటర్’ అనే చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఈనెల 26న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. గత సంవత్సరం నవంబర్ 26న జరిగిన దిశ అత్యాచారంను ఆధారంగా చేసుకొని ఈ మూవీని వర్మ తెరకెక్కించారు. వర్మ తీస్తున్న దిశా మూవీ కూడా ఈ సంవత్సరం నవంబర్ 26న విడుదల చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే మర్డర్ మూవీతో కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్న వర్మ ఇప్పుడు ఈ దిశా చిత్రంతో ఎలాంటి వివాదాలు ఎదురుకొంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here