YS Jagan Mohan Reddy : ట్విట్ట‌ర్‌ ని షేక్ చేస్తున్న వైకాపా సోష‌ల్ మీడియా ఆర్మీ

NQ Staff - May 22, 2023 / 09:07 PM IST

YS Jagan Mohan Reddy  : ట్విట్ట‌ర్‌ ని షేక్ చేస్తున్న వైకాపా సోష‌ల్ మీడియా ఆర్మీ

YS Jagan Mohan Reddy  : 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైకాపా ఘ‌న‌విజ‌యం సాధించి నాలుగు సంవ‌త్స‌రాలైన సంద‌ర్భంగా వైకాపా సోష‌ల్ మీడియా కార్య‌కర్త‌లు, నాయ‌కులు, అభిమానులు #YSRCPAgain2024 హ్యాష్‌ ట్యాగ్‌తో ట్విట‌ర్ లో ట్రెండింగ్‌ను చేశారు.

హ్యాష్ ట్రెండింగ్ ప్రారంభ‌మైన ప‌ది నిమిషాల్లోనే జాతీయ స్థాయిలో ఈ హ్యాష్ ట్యాగ్‌ మొద‌టి స్థానంలో నిలిచింది. త‌న నాలుగేళ్ళ పాల‌న‌లో వైయ‌స్ జ‌గన్ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌తో పాటు ఆయ‌న రాజ‌కీయ ప్రస్థానానికి సంబంధించిన స‌మాచారంతో కూడిన ట్వీట్ల‌ను వైయ‌స్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్స్‌కు దేశ‌ వ్యాప్తంగా భారీగా రీచ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో వైకాపా కార్యకర్తలు మరియు వైకాపా సోష‌ల్ మీడియా విభాగం చాలా యాక్టివ్‌ గా ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. ప్రభుత్వ పథకాలు మరియు జగన్ చేపట్టిన కార్యక్రమాలను ట్విట్టర్ లో ప్రధానంగా చర్చించుకుంటూ అభిమానులు మరియు కార్యకర్తలు సాగుతున్నారు.

Discussing Programs By YS Jagan Mohan Reddy On Twitter

Discussing Programs By YS Jagan Mohan Reddy On Twitter

గ‌త సంవత్సరం వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మదినం సంద‌ర్భంగా జ‌రిగిన ట్రెండింగ్‌లోనూ జాతీయ స్థాయిలో ఇలాంటి రీచ్ వచ్చిన విషయం తెల్సిందే. వైకాపా కార్యర్తలు మరియు అభిమానులు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండటంతో పాటు సోషల్ మీడియా టీమ్‌ చాలా యాక్టివ్‌ గా పని చేయడం వల్లే ఈ స్థాయి ఫలితాలు నమోదు అయినట్లుగా సోషల్‌ మీడియా టాక్‌.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us