కరోనా వస్తే బహిష్కరణ ఎక్కడో తెలుసా..!

Advertisement

కరోనా మానవ జీవితాలలోకి వచ్చి సంబంధాలను దూరం చేస్తుంది. అయితే కరోనా వచ్చిందంటే బ్రతుకు ఆగమే.. నా అన్న వాడు కూడా పరాయి వాడు అవుతున్నాడు. మాయ దారి రోగంతో మనుషుల బ్రతుకు హీనంగా తయారయింది. అయితే కరోనా సోకిందని తనను ఎక్కడ హీనంగా చూస్తారో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో కరోనా పాజిటివ్ అని తెలిసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తనకు కరోనా పాజిటివ్ అని తెలిస్తే సమాజం వెలివేస్తోందని భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు.

అలాగే కొన్ని రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోనూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనికి కారణం గ్రామీణ వాసుల్లో కరోనాపై అవగాహన లేకపోవడం అందుకోసమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే కరోనా పై అవగాహన కల్పించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని ఈ ఘటనలతో స్పష్టంగా తెలుస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతంలో చిన్నగా జలుబు చేసిన కూడా తమకు కరోనా అనుకుంటున్నారు. అలాగే సమాజంలో అందరికీ తెలిస్తే వారిని కూడా దూరం పెడతారు అని భయపడుతున్నారు. అందుకె కరోనా పై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here